అంగన్వాడీ టీచర్ లకు ప్రీస్కూల్ విద్యా బోధన పై శిక్షణ.

Rathnakar Darshanala
అంగన్వాడీ టీచర్ లకు ప్రీస్కూల్ విద్యా బోధన పై శిక్షణ.
-కార్యక్రమాన్ని ప్రారంభించిన : అర్బన్ సిడిపిఓ మమత.
మిర్యాలగూడ-జూన్ 19(నేటివార్త) : పట్టణంలోని అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో డైరెక్టరేట్ వారి యొక్క ఆదేశాల మేరకు నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అంగన్వాడీ టీచర్ లకు 

ప్రీస్కూల్ విద్యా బోధన పై శిక్షణా కార్యక్రమాలను, ప్రాజెక్ట్ లోని 35 మంది టీచర్స్ ని ఒక బ్యాచ్ చొప్పున, మొత్తం 6 బ్యాచ్ లను ఏర్పాటు చేసుకొని, ప్రతి బ్యాచ్ కి మూడు రోజుల పాటు మాస్టర్ ట్రైనర్ గా అర్బన్ సిడిపిఓ మమత శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
 ఈ కార్యక్రమం లో భాగంగా మొదటి బ్యాచ్ కి తేదీ19 నుండి నుండి 21వరకు సీడీపీఓ మమత మరియు దామరచర్ల సూపర్వైజర్ నాగమణి మాస్టర్ ట్రైనర్ లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో నూతన ప్రాథమిక కరిక్యులం పైన, జాతీయ నూతన విద్యా విధానం గురించి అంగన్వాడీ టీచర్స్ కి వివరించారు. గురువారం కార్యక్రమంలో భాగంగా
1.అంగన్వాడీ బడిబాట, 
2.జూన్ నెల టైం టేబుల్,
3.పూర్వ పఠన-పూర్వ లిఖిత భావనలు,
4.పోర్ట్ పోలియోలు,
5.పూర్వ గణిత భావనలు.. పైన ఈరోజు శిక్షణ అందించారు. 

ఈ కార్యక్రమంలో
సూపర్వైజర్స్ రేవతి, పద్మ, రాధిక, లీలా కుమారి, మాధవి, రాధిక, నజీమా బేగం, సుశీల.
సైదమ్మ -డిపిఏ(పోషన్ అభియాన్ )
కవిత-బిసి(పోషన్ అభియాన్ )
మరియు టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments