తాతా నాయనమ్మల నడుమ కల్వకుంట్ల హిమాన్షు పుట్టిన రోజు వేడుకలు.

Rathnakar Darshanala
తాతా నాయనమ్మల నడుమ కల్వకుంట్ల హిమాన్షు పుట్టిన రోజు వేడుకలు.

టీనేజ్ దాటిన కేసీఆర్ మనుమడు..

టీనేజ్ దాటుతున్న మనుమడికి ఇష్టంతో 19 కేజీల భారీ కేక్ ను తెప్పించిన నాయనమ్మ శోభమ్మ..

తాత కేసీఆర్ గారి ఆశీర్వాదాలు తీసుకున్న హిమాన్షు..

కుటుంబ సభ్యులు సిబ్బంది నడుమ కేక్ కట్ చేసి పుట్టిన రోజు జరుపుకున్న హిమాన్షు..

పుట్టిన రోజు సందర్భంగా మొక్క నాటిన హిమాన్షు

బిఆర్ఎస్ అధినేత, కేసీఆర్ గారి మనుమడు, మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, కల్వకుంట్ల హిమాన్షు పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఘనంగా జరిగాయి. 

19 ఏండ్ల టీనేజ్ వయస్సును దాటిన మనుమడు హిమాన్షు ఇరవైలోకి  ప్రవేశించిన ప్రత్యేక సందర్భంగా నాయనమ్మ శోభమ్మ గారు ఇష్టంతో 19 కేజీల భారీ కేకును తయారుచేయించారు. 

కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సిబ్బంది నడుమ హిమాన్షు తన పుట్టినరోజు వేడుక జరిగింది. 

భారీ కేకును కట్ చేసి తాతయ్య నాయనమ్మలకు కేకును తినిపించిన హిమాన్షు, వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

శతమానం భవతి” అంటూ తమ గారాల మనవన్ని కేసీఆర్ దంపతులు  మనసునిండా దీవించారు. 

అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఎర్రవెళ్లినివాసం ఆవరణలో హిమాన్షు మొక్కను నాటారు.

ఈ సందర్భంగా హిమాన్షు మాతృమూర్తి, కేటీఆర్ సతీమణి  శైలిమ, అమ్మమ్మ శశికళ, వినోదమ్మ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments