ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు.. ముఖ్యమంత్రి అభినందనలు.
By
Rathnakar Darshanala
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు.. ముఖ్యమంత్రి అభినందనలు.
హైదరాబాద్ డెస్క్ నేటి వార్త :
పుట్టుకతో కాలేయ సమస్యతో బాధ పడుతున్న ౩ సం. వయసున్న మాస్టర్ చోహన్ ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు,
పారా మెడికల్ సిబ్బందికి ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
కుమారుడి కోసం కాలేయం దానం చేసిన మాతృమూర్తి అమల, చికిత్స పూర్తి చేసుకున్నఆదిత్య పూర్తిగా కోలుకుని నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రిగారు ఈ సందర్భంగా ఒక సందేశంలో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
Comments