వైసీపికి భారీ షాక్.చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరిన మహానంది ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని.
By
Rathnakar Darshanala
వైసీపికి భారీ షాక్.చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరిన మహానంది ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని.
నేటివార్త 19 మహానంది..
మహానంది మండలంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది సీతారామపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు బుడ్డారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి కుమార్తె మహానంది మండల ఎంపీపీ యశస్విని మరియు సీతారాంపురం గ్రామ సర్పంచ్ బుడ్డారెడ్డి తేజస్విని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
వీరితోపాటు మహానంది దేవస్థానం మాజీ ధర్మకర్త గంగిశెట్టి మల్లికార్జున రావు. తిమ్మాపురం నాగభూపాల్ రెడ్డి.మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం,
పార్టీ శ్రీశైలం నియోజకవర్గం అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామలింగారెడ్డి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఉల్లి మధు. నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి. క్రాంతి కుమార్. తదితరులు పాల్గొన్నారు.
Comments