తండ్రిని కోల్పోయిన వధువుకు పుస్తెమెట్టలు పట్టుచీర అందచేసిన.ఉగ్గే శ్రీనివాస్ పటేల్.
By
Rathnakar Darshanala
తండ్రిని కోల్పోయిన వధువుకు పుస్తెమెట్టలు పట్టుచీర అందచేసిన.ఉగ్గే శ్రీనివాస్ పటేల్.
*నేటి వార్త జుక్కల్ ఆర్ సి ఏప్రిల్ 19*
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామం ఆర్థికంగా వెనుకబడి తండ్రి నీ కోల్పోయిన మున్నూరు కాపు వధువు వివాహానికి మున్నూరుకాపు ఆత్మగౌరవ మహా ధర్నా సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో పుస్తె మెట్టలు పట్టుచీర అందించడం జరిగింది.
వధువు కుటుంబానికి అండగా మున్నూరు కాపు సంఘం ఎప్పుడూ తన వెంట ఉంటుందని ఆమెకు భరోసాగా నిలుస్తామని అన్నారు.
పార్లమెంట్ ఎలక్షన్ లో మున్నూరు కాపులు ఏ పార్టీలో నిలబడ్డ వారిని గెలిపించుకోవాలని అన్నారు. మున్నూరు కాపు అభ్యర్థి గెలిస్తే బిసి కులాలకు బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ రామిని సందీప్ జిక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ మొగులయ్య, బుడాల శ్రీనివాస్ మున్నూరుకాపు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు...
Comments