వలస వాదులను తరిమికొట్టండి.గులాబీ జెండాకు అండగా ఉండండి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.

Rathnakar Darshanala
వలస వాదులను తరిమికొట్టండి.గులాబీ జెండాకు అండగా ఉండండి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి) 

రామగుండం నియోజకవర్గం ఏప్రిల్ 19 

పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి బారాస పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా శుక్రవారం నాడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలోని రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ అందించారు, 

మొదటగా గోదావరిఖనిలో సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలోని శ్రీశ్రీశ్రీ జయ దుర్గా దేవి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం కొప్పుల ఈశ్వర్ ర్యాలీగా గోదావరిఖని నుండి పెద్దపల్లి బయలుదేరి గులాబీ సైనికుల మధ్య పెద్దపల్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందించారు,

 ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో గత పది సంవత్సరాలు పాలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేసిందని ప్రస్తుతం ప్రజా పాలన పేరుతో ప్రజలను గారడి చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని,

 కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విసుకు చెందారన్నారు తిరిగి కెసిఆర్ నాయకత్వంలోని గులాబీ జెండా కావాలని బారాసాని ప్రజలు కోరుకుంటున్నారన్నారు, 

పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం వలస వాదులకు పారిశ్రామికవేత్తలకు అడ్డగా మారిందని వలసవాదులను తరిమికొట్టి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బారాసా అభ్యర్థిగా తను ఆదరించాలని ప్రజలను కోరారు, 

వలస వాదులను తరిమికొట్టడంలో ప్రజలంతా గులాబీ జెండాను అక్కున చేర్చుకోవాలని కొప్పుల ఈశ్వర్ కోరారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ప్రజలకు అన్ని పథకాలు అమలు కావాలంటే కేసిఆర్ నాయకత్వంలోని బారాసతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి లేదని ఆయన అన్నారు, 

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రజలందరూ బారాసాను ఆదరించి తనను స్థానిక అభ్యర్థిగా సింగరేణి కార్మికునిగా ప్రతి ఇంట్లో ఒక కుమారుని లాగా భావించి తనను పార్లమెంటుకు పంపిస్తే,

 పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరి పక్షాన పార్లమెంటులో గలమై మాట్లాడి ఈ ప్రాంత ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించి ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలాగా కృషి చేస్తానని,

సింగరేణి కార్మికులకు అండగా ఉంటానని రైతుల పక్షాన రైతులకు రావలసిన ప్రతి రైతుబంధు తో పాటు ప్రతి పథకం అమలయ్యే విధంగా పార్లమెంటులో పెద్దపల్లి ప్రజల పక్షాన గలమై ఉంటానని కొప్పుల ఈశ్వర్ తెలిపారు, 

వలసవాదులకు పారిశ్రామికవేత్తలకు ఈసారి ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పి స్థానిక వ్యక్తిగా ఒక కార్మికునిగా మీలో ఒకనిగా భావించి తనను ఆదరించి పార్లమెంటుకు పంపించాలని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు, 

ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్దపల్లి బారాస అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరు కంటి చందర్, జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ పెంట రాజేష్, కార్పొరేటర్లు స్థానిక నాయకులు గులాబీ సైనికులు ప్రజలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
Comments