తల్లితండ్రులు మన మొదటి గురువులు.పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్.

Rathnakar Darshanala
తల్లితండ్రులు మన మొదటి గురువులు.పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్.

*:-వాళ్ల  రుణం మనం ఏం ఇచ్చి తీర్చుకోగలం...*


*పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్*

 *నేటి వార్త ప్రతినిధి జుక్కల్ ఆర్ సి ఏప్రిల్ 27*

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం, ఇంద్రనగర్ లో శుక్రవారం రోజున డాక్టర్” సద్గురు బసవలింగ అవధూత మహారాజ్ (మల్లయ్యగిరి & దెగల్ మాడి ఆశ్రమ పిఠధిపతి) గ్రామం. కుప్పానగర్, మండలం ఝరాసంగం, జిల్లా సంగారెడ్డి  మంగళ హరతులతో మహిళలు డప్పు చప్పుల్ల మధ్య ఘన స్వాగతం పలికారు. 

డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్  భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేస్తూ... జీవితంలో మొదటి గురువు తల్లి,కన్నతల్లిని ఎప్పుడూ కూడా చెడు మాటలు అనకూడదు దూషించకూడదు. 

తల్లితండ్రులు మొదటి గురువులు వాళ్లు మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపులు తల్లితండ్రులకు పట్టేడంత అన్నం పెట్టండి. ఈ జన్మని ఇచ్చిన తల్లిదండ్రుల యొక్క రుణం ఏమి ఇచ్చి తీర్చుకోగలం..
కన్నతల్లి కన్నుమూస్తే ఏడుపేందుకు రా.. ఉన్నంతకాలం కాలతో తన్నుడెందుకురా.. కూలి నాలి పనులు చేసి చదువు నేర్పేరా.. చదివి చదివి ఉన్న కొడుకు పదవికేక్కేరా...
మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏదైనా ఒక గురువు బాటలో ఉండాలి.

 గురువు అంటే మొదటగా తల్లిదండ్రులు తర్వాత ప్రత్యక్షంగా మనకు బోధించి మన గురించి ఆలోచించే గురువు. అటువంటి గురువుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు శాంతి సమాధానం తోని ఉండాలి. 

మనం అనుకుంటాం చాలా రోజు ఉంటామని ఈ భూమి పైన ఉన్నన్ని రోజులే భక్తి చేయాలి. 

ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం భక్తులు పక్క మండలాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. భక్తులందరికి డాక్టర్ బండివార్ విజయ్ ఆధ్వర్యంలో అన్నదానం వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది...
Comments