నేటివార్త కథనానికి స్పందన.అ గ్రామానికి మంచి నీటి సౌకర్యం కల్పించిన అధికారులు.

Rathnakar Darshanala
నేటివార్త కథనానికి స్పందన.అ గ్రామానికి మంచి నీటి సౌకర్యం కల్పించిన అధికారులు.

"కుసుంపూర్ వాసుల దాహాన్ని తీర్చండి "కథనానికి స్పందించిన అధికారులు.


నేటివార్త , ఖానాపూర్ రూరల్ (ఏప్రియల్ 27):ఖానాపూర్ మండలంలోని ఆదివాసీ గ్రామమైన కొలాంగూడ పరిధిలోని కుసుంపూర్ వాసులు త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఈ విషయంపై గిరిజన సంఘం నాయకుని ద్వారా ఈ నెల 24న బుధవారం నేటివార్త లో  ''కుసుంపూర్ వాసుల దాహాన్ని తీర్చండి'' శీర్షికన కథనం ప్రచురితం అయింది.

దీంతో ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ తో పాటు ప్రభుత్వ అధికారులైన మండల పంచాయతీ అధికారి చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణ, గ్రిడ్ అధికారులు వెంటనే స్పందించి ఈ గురువారం కొలాంగూడ గ్రామ పరిధిలోని కుసుంపూర్ ని సందర్శించారు.

కుసుంపూర్ వాసుల  త్రాగునీటి సమస్యలను తెలుసుకున్నారు.మిషన్ భగీరథ ట్యాంకు పైపుల మరమ్మతులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

చేతిపంపుని పరిశీలించి,వేసవిలో వారికి ఏర్పడే త్రాగునీటి ఇబ్బందులను పరిష్కరిస్తామని నేటి వార్త యాజమాన్యం తో అన్నారు.
Comments