కుసుంపూర్ వాసుల దాహాన్ని తీర్చండి.

Rathnakar Darshanala
కుసుంపూర్ వాసుల దాహాన్ని తీర్చండి.
ఆదివాసీల త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలి.

ప్రభుత్వాలు మారినా ఆదివాసీ గ్రామాలకు తప్పని త్రాగునీటి సమస్యలు.


తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నిర్మల్ జిల్లా కార్యదర్శి తొడషం శంభు.



నేటివార్త , ఖానాపూర్ రూరల్ 

(ఏప్రియల్25):కుసుంపూర్ గూడెంలోని ఆదివాసిలకు త్రాగునీటి సమస్యలను పరిష్కరించి వారి దాహార్తిని తీర్చాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసం శంభు డిమాండ్ చేశారు.

బుధవారం ఖానాపూర్ మండలం కొలాంగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కుసుంపూర్ లో పర్యటించిన ఆయన గూడెం వాసుల త్రాగునీటి సమస్యలను తెలుసుకుని కుసుంపూర్ కి త్రాగునీటి సమస్యను తీర్చాలని ఆ గూడెం వాసులతో కలిసి నిరసన  తెలిపారు.

ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ఆదివాసీ గ్రామలకు నీటి సమస్య మారలేదని అన్నారు.

40 పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ గూడెం లో త్రాగునీటి సమస్యలతో ఆదివాసీల గొంతు ఎండిపోతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని అన్నారు.మిషన్ భగీరథ ట్యాంకులున్నా అరకొరగానే త్రాగునీరు వస్తుందని అన్నారు.

అత్యధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా చేతిపంపులలో నీరు అడుగంటిపోయి 10 నుండి 20 బిందెల త్రాగునీరే వస్తుందని వాపోయారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదివాసీల త్రాగునీరు సమస్యలను పరిష్కరించాలని అన్నారు.లేనియెడల ఖానాపూర్ మండలంలోని ఎంపిడిఓ కార్యాలయం ఎదుట కాలిబిందెలతో ధర్నా నిర్వహిస్తామని అన్నారు.

దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని అన్నారు.తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు అత్రం జగ్గారావు, కుసుంపూర్ వాసులు ఆత్రం చందన్ షాప్,కోవ అత్యంత రావు, దేవ్రావు, పుర్క లింబారావు,భీమ్బాయి, సుంగు,శ్యామల,మధుబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments