అలా వచ్చి ఇలా పోయేవారికి ఓట్లేస్తే అభివృద్ధి ఉండదు.

Rathnakar Darshanala
అలా వచ్చి ఇలా పోయేవారికి ఓట్లేస్తే అభివృద్ధి ఉండదు.
పెద్దపల్లి బారాస అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.


(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి రామగుండం) 
ఏప్రిల్ 25 :

అలా వచ్చి ఇలా వెళ్లేవారికి ఓట్లు వేస్తే అభివృద్ధి శూన్యమని కోట్లాది రూపాయలు పెట్టి పారిశ్రామికవేత్తలుగా వలసవాదులుగా పారిశ్రామికవేత్తలుగా పెద్దపల్లిలో పోటీ చేస్తూ పెద్దపల్లికి చేసింది ఏమీ లేదని బారాస ఎంపీ అభ్యర్థి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు, 

గురువారం ఆయన ఆయా ఏరియాలో ప్రచారం నిర్వహించారు,
వీకెండ్ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తే పెద్దపల్లి జిల్లా అభివృద్ధి వెనుకబడిపోతుందని ఇలాంటి నాయకులకు ఓట్లు వేయవద్దని  మాజీ మంత్రి.. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ l అన్నారు.
 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాలలో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా కొప్పుల ఈశ్వర్  మాట్లాడుతూ... వేల కోట్ల రూపాయలు ఉన్న వివేక్ కుటుంబం పెద్దపల్లి అభివృద్ధికి ఏం చేసిందని ప్రశ్నించారు. 

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఎవరు కూడా స్థానికులు కాదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లోనే ప్రజలు చెందారని, 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ఆగమాగం అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఎకరా కూడా  పొలాలు కూడా ఎక్కడ ఎండిపోలేదని అన్నారు. 

కానీ కాంగ్రెస్ పార్టీ 120 రోజుల పాలనలోనే నీళ్లు లేక కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పొలాల మొత్తం ఎండిపోయాయని దీంతో రైతులు ఎంతో ఆవేదన చెందుతున్నారని అన్నారు.
 ప్రతి పంటకు నీరు అందించేలా ప్రాజెక్టులను కట్టి కెసిఆర్ రైతులను ఎంతో ఆదుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని గ్రామ గ్రామాన ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 

వేల కోట్ల రూపాయలు ఉన్న వివేక్ పెద్దపల్లిలో ఒక ఫ్యాక్టరీ అయిన పెట్టారా... ఇక్కడ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా ప్రశ్నించారు. 

తమ ఆస్తులను కాపాడుకోవడానికి మళ్లీ పదవులు కావాలని వస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులది పెద్దపల్లి కాదని, వాళ్లంతా హైదరాబాదుకు చెందినవారని ఆరోపించారు. 

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరి కుంటలో పుట్టి పెరిగానని, జిల్లాలో ఉన్న సమస్యలతో పాటు కార్మికులు రైతుల సమస్యలు అన్ని తెలుసని అన్నారు. 

పెద్దపల్లి ఎంపీగా ఒక అవకాశం ఇచ్చి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొప్పుల ఈశ్వర్  ప్రజలను కోరారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments