కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు...కొప్పుల.
By
Rathnakar Darshanala
కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు...కొప్పుల.
(జీన్స్ రెడ్డి నేటి వార్త l ప్రతినిధి రామగుండం)
రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే..
మాజీ ఎమ్మెల్యే.. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్.
సింగరేణి కార్మికుడు బిడ్డగా.. సింగరేణి కార్మికుడిగా కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని మాజీ ఎమ్మెల్యే.. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు.
ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35, 36 వ డివిజన్ లో మాజీ మంత్రి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు.
సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మరో సారి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ లో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సింగరేణికి షాపింగ్ కాంప్లెక్స్ కావాలని స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న సింగరేణి క్వాటర్లను తొలగించడం దుర్మార్గమైన చర్యాని పేర్కొన్నారు.
ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ఇండ్లను కూల్చివేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీములు ఏర్పాటు చేసి యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని కొనియాడారు.
ఈ పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
స్థానిక కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చెలుకల పెల్లి శ్రీనివాస్.కౌటం బాబు గురుస్వామి.నరదాసు మారుతి మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments