శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క.
By
Rathnakar Darshanala
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క.
నేటి వార్త ఖమ్మం ప్రతినిధి.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల గ్రామంలోని శ్రీరామ ఆలయంలో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అంతకముందు ఆలయ కమిటీ సభ్యులు సుగుణక్కకు ఘన స్వాగతం పలికారు.పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు,నాయకులకు సుగుణక్క శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ సీతారాములు చల్లని దీవెనలతో ప్రజలందరికి సకల శుభాలు కలగాలని,పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
Comments