నేడు నామినేషన్ కు గులాబీ సైనికులు తరలి రండి మాజీ మంత్రి కొప్పుల.
By
Rathnakar Darshanala
నేడు నామినేషన్ కు గులాబీ సైనికులు తరలి రండి మాజీ మంత్రి కొప్పుల.
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి రామగుండం)
పెద్ద పెళ్లి పార్లమెంట్ అభ్యర్థిగా నేడు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ బారసా అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నేడు 19 తారీకు శుక్రవారం ఆ అమ్మవారి దీవెనలతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నారు,
ఈ నామినేషన్ కార్యక్రమాన్ని బారాసా నాయకులు కార్యకర్తలు సైనికుల వలే పాల్గొని విజయవంతం చేయాలని బారాస పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరు కంటి చందర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు హాజరవుతున్నారని చందర్ తెలిపారు,
పెద్దపల్లి లో గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా ఈ నామినేషన్ కార్యక్రమం ఉంటుందని భారస నాయకులు కార్యకర్తలు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
తన నామినేషన్ అమ్మ వారి దీవెనలతో వేయనున్నట్లు ఉన్నట్లు మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రజలు రైతులు బారాస సైనికులు హాజరై తనను దీవించాలని ఈ నామినేషన్ కార్యక్రమం తో వలసవాదులకు స్థానికులకు జరుగుతున్న పోటీ తెలవాలని కొప్పుల ఈశ్వర్ తెలిపారు
Comments