వైభవంగా శ్రీ సీతారాముల పరిణయ వేడుకను కనులారా తిలకించిన భక్త జనమందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Rathnakar Darshanala
వైభవంగా శ్రీ సీతారాముల పరిణయ వేడుకను కనులారా తిలకించిన భక్త జనమందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.


కె.వి.చౌదరి(శ్రీ బాలాజి బిల్డప్స్ ఇండస్ట్రీ రెసిడెన్సీ తిరుపతి).

నేటి వార్త.

శ్రీరామా జయ రామా జయ జయ రామా కేతనాల నడుమ వేదమంత్రోత్సవాలతో వైష్ణవ సంప్రదాయ పద్ధతులలో దశరథ మహారాజ కుమారుడైన శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజ కుమార్తె అయిన సుగుణ శీలి సీతమ్మకు తెలుగురాస్ట్రాలలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన వైదిక అర్చకులు నిర్వహించారు.

భద్రాచల దివ్య క్షేత్రమున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆవరణలోని వేలాదిగా తరలివచ్చిన భక్తజనుల సమక్షంలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

ఆగమశాస్త్రం ప్రకారం శ్రీరాముడి జన్మదినం రోజునే సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగటం ఆనవాయితీ కాగా జరిగేటటువంటి సీతారాముల కల్యాణాన్ని అనుసరించే దేశంలోని అన్ని రామాలయాలలో కళ్యాణ ఉత్సవాలను జరపటం ఆనవాయితీ.

అంతటి ప్రాముఖ్యత గల సీతారాముల కళ్యాణ మహోత్సవం బుధవారం ఏకూజామునే మేల్కొలుపు సేవనంతరం స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి దైవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి 10 గంటల సమయంలో ఊరేగింపుగా ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి కళ్యాణ కృతువును ప్రారంభించారు.

ఖచ్చితంగా 12 గంటలకు అభిజిత్తు లగ్నంలో సీతమ్మ తలపై శ్రీరామచంద్రుడు జిలకర బెల్లం పెట్టి వివాహ వేడుకలను నిర్వహించారు.

ప్రభుత్వం తరఫున ముఖ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవస్థాన నేతృత్వంలోని పలు దేవాలయాల పాలక మండలితో పాటు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో కళ్యాణ మహోత్సవానికి దేశ నలుమూలల నుండి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థల వారు అన్నదానం అల్పాహార దానంతో పాటు మజ్జిగ మంచినీరు పానకంలను అందించి వారి ఔదార్యాన్ని చాటుకొంటుంటారని

వచ్చిన యాత్రికులకు భక్తులకు ముత్యాల తలంబ్రాలతో పాటు స్వామివారి ప్రసాదాన్ని అందించేందుకు పట్టణంలో వివిధ కూడళ్ల వద్ద ఏర్పాటుచేసిన కౌంటర్ల ద్వారా తలంబ్రాలు లడ్డు ప్రసాదాన్ని కూడా అందిస్తుంటారని  యం.పి.ప్రసాద్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఉదార నేత కె.వి.చౌదరి శ్రీరామనవమి విశిష్టతను వివరించి అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments