బారాస పాలనలో కాంతులు...కాంగ్రెస్ పాలనలో చీకటి ఇది..పైవింగ్ లైన్ చౌరస్తా తీరు..!

Rathnakar Darshanala
బారాస పాలనలో కాంతులు...కాంగ్రెస్ పాలనలో చీకటి ఇది..పైవింగ్ లైన్ చౌరస్తా తీరు..!
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి రామగుండం) 

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని వైవింగ్ లైన్ చౌరస్తా లో నాడు బారాస పాలనలో కాంతులు విరజిల్లాయని నేటి కాంగ్రెస్ పాలనలో చీకటి నెలకొంది అని చౌరస్తాలో ఏర్పాట్లు చేసిన జంక్షన్ లో

 ప్రస్తుతం కాంగ్రెస్ పాలన అంత చీకటి మాయం చేసిందని సరైన మెయింటెనెన్స్ లేదని 12వ డివిజన్ కార్పొరేటర్ బారాస నాయకులు బొడ్డు రజిత రవీందర్లు ఆరోపించారు,

 10 సంవత్సరాల బారాస పాలన ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సఫలీకృతమైందని ప్రజలకు కావాల్సిన ప్రతి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్కడ ఏ లోపం జరగకుండా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరువవడమే కాకుండా 

రామగుండం కార్పొరేషన్ లో ప్రస్తుత భారస మాజీ శాసనసభ్యులు కోరు కంటి చందర్ నాయకత్వంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగిందని అప్పట్లో కార్పొరేషన్ అధికారులు సైతం వెంటనే మెయింటెనెన్స్ పూర్తిగా చూసుకునేవారని ఇప్పుడు మెయింటెనెన్స్ సైతం కరువైదని వారు పేర్కొన్నారు, 

తద్వారా ఆ ప్రాంతమంతా చీకటి నిండుకోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు గాయాలపాలై ఇబ్బందులకు గురవుతున్నారని దీనిని పరిశీలించి సరైన మెయింటెనెన్స్ ఏర్పాటు చేయాలని రామగుండం పురపాలక సంఘ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ని వారు కోరారు, 

గ్యారంటీల పాలన పేరుతో మోసాల పాలన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అభివృద్ధి లేదు అంతా ఆగమాగం అని బొడ్డు రజిత రవీందర్ పేర్కొన్నారు, 

దీనిపై పురపాలక సంఘ కమిషనర్ విచారణ జరిపి సిబ్బందిని ఆదేశించి జంక్షన్ల మెయింటెనెన్స్ సరిగా ఉండే విధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నా బాధ్యత ఉందని వారు కోరారు,
Comments