కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోవద్దు.

Rathnakar Darshanala
కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోవద్దు.
ప్రచార రథాన్ని అడ్డగించిన సీనియర్ నాయకులు

తాండూర్,నేటివార్త (ఏప్రిల్ 26) తాండూరు మండలంలో పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీ కృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.

 బోయపల్లి నుంచి తాండూర్ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన అనంతరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు.

పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పర్యటనలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ పురాణ సతీష్, పాల్గొన్నారు.

కార్యకర్తలు మాట్లాడుతూ  కొత్తవారిని పార్టీలోకి తీసుకోవద్దని అదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మాజీ సర్పంచ్ సల్వాజి ఉమాదేవి  సీనియర్ నాయకులు సల్వాజి మహేందర్ రావు  కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఒక వర్గం వారు సానుకూలంగా ఉన్న  వేరే వర్గం వారు కాంగ్రెస్ పార్టీలో ఎవరిని చేరనీయబోమని చేరకూడదని కాంగ్రెస్ పార్టీలో గొడవలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు వాపోయారు. 

సుమారు 200 మంది పైచిలుకు ఇతర పార్టీల నుండి
మహేందర్ రావు ఆధ్వర్యంలో చేరికకు సిద్ధమయ్యారు. చేరికలు ఒక రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు
 కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, 

అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, జిల్లా పెద్దలతో మాట్లాడి తాండూర్ మండలంలో చేరికల నిర్ణయాన్ని నిర్ణయిస్తామని మహేందర్ రావుకు. ఫోన్ ద్వారా సమాచారం అందించారు.గడ్డం వంశీకృష్ణ గెలుపుకు సహకరించాలని మహేందర్ రావు ను కోరారు.
Comments