ప్రతి రైతుకు ఐడి కార్డు తప్పనిసరి. వ్యవసాయ అధికారి లావణ్య.
By
Rathnakar Darshanala
ప్రతి రైతుకు ఐడి కార్డు తప్పనిసరి. వ్యవసాయ అధికారి లావణ్య.
ప్రతి రైతుకు ఫార్మర్ ఐడి గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించిన మల్లాపూర్ వ్యవసాయ అధికారి లావణ్య.
నేటివార్త మల్లాపూర్:ఏప్రిల్05: మల్లాపూర్ మండలంలోని మల్లాపూర్ మొగిలిపేట్ దామరాజ్ పల్లి సిరిపూర్ గ్రామాలలో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది.
వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి పౌరునికి ఆధార్ కార్డుతో గుర్తింపు ఇచ్చి 14 నంబర్లతో విశిష్ట సంఖ్య ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
భూమి ఉన్న ప్రతి రైతులకు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడి కేటాయించడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అనుసంధానం చేయబడుతుంది. కావున పీఎం కిసాన్ లబ్ధిదారులు తర్వాత వచ్చే విడత పొందాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రైతులు ఆధార్ కార్డు పట్టాదార్ పాస్ పుస్తకం ఆధార్ తో లింకు చేయబడిన ఫోను తీసుకొని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మీసేవ వద్ద చేయించగలరని తెలిపారు.
Comments