తెలంగాణ ప్రజల ఆకాంక్ష బారాస ఆవిర్భావం..! ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం.
By
Rathnakar Darshanala
తెలంగాణ ప్రజల ఆకాంక్ష బారాస ఆవిర్భావం..! ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం! బారాస అధ్యక్షులు కోరు కంటి చందర్
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి రామగుండం)
తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఏర్పడిన పార్టీ బారాస అని మాజీ రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బారాస అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు,
శనివారం బారాస 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించిన అనంతరం కోరు కంటి చందర్ మాట్లాడారు,
తెలంగాణ ఆవిర్భావమే బారసా లక్ష్యంగా మారిందని తెలంగాణ ఏర్పడేదాకా అనేక ఉద్యమాలు చేసి కేసీఆర్ నాయకత్వంలో సమైక్యవాదుల కుట్రల నుండి రాష్ట్ర ఏర్పాటు చేసుకోవడం జరిగిందని,
10 సంవత్సరాలపాటు అధికారం చేపట్టిన బారాస ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి సామాన్యుని మొదలుకుంటే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసిన పార్టీ అని చందర్ పేర్కొన్నారు,
ఇక గ్యారంటీ ల పేరుతో ఎలాంటి గ్యారెంటీ లేకుండా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు అనుగుణంగా పనిచేస్తామని రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు,
కేవలం స్వార్థం మాటలు చెప్పి అధికారం చేపట్టడం జరిగిందని రైతులను పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఫై ఆయన ధ్వజమెత్తారు,
అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసే వరకు హామీలు నిలబెట్టేవరకు ప్రజా పోరాటాలకు బారాస సైనికులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు,
కాంగ్రెస్ మోసపూరితమైన వాగ్దానాలు తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదని తిరిగి రానున్న రోజుల్లో బారాస జెండా పార్లమెంటు ఎన్నికల్లో ఎగరడం ఖాయమని కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని భారత వైపు ప్రజలు చూస్తున్నారని కోరు కంటి చందర్ పేర్కొన్నారు,
తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ ఎంపి స్థానాలను బారాస పార్టీ కైవసం చేసుకోబోతుందని పెద్దపల్లిలో సైతం వలసవాదులను పారిశ్రామికవేత్తలను తరిమికొట్టి కార్మికుడైన కార్మిక బిడ్డ మాజీ మంత్రి బారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వైపు ప్రజలంతా చూస్తున్నారని పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులను కదిలిస్తుందని మోసపూరిత కాంగ్రెస్ని ప్రజలు నిలదీసే విధంగా,
పెద్దపల్లిలో గులాబీ జెండాను ఎగురవేయడానికి కొప్పుల ఈశ్వర్ ని ఎంపీగా గెలిపించడానికి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం లోని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఇక పారిశ్రామికవేత్తలకు వలస వాదులకు ప్రజలు పెద్దపల్లి ప్రజలు చెక్ పెట్టబోతున్నారని కోరు కంటి చందర్ భీమా వ్యక్తం చేశారు,
పార్టీలోని కార్యకర్తలు నాయకులు సైనికుల వలే పనిచేసి కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలిసే విధంగా గులాబీ సైనికులంతా సిద్ధమై ప్రజలకు చేరవేయాలని కాంగ్రెస్ మోసాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాము కుంట్ల భాస్కర్ నాయకులు అధికార ప్రతినిధి శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,
Comments