నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
By
Rathnakar Darshanala
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
నేటి వార్త ఆంధ్రప్రదేశ్ :
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్నారు.
ఈ మేరకు శుక్రవారం విశాఖ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.
లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.
ఆయన పార్టీకి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్గా టార్చిలైట్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
Comments