వైరా రిజర్వాయర్ మంచినీటితో ప్రజల ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరం.
By
Rathnakar Darshanala
వైరా రిజర్వాయర్ మంచినీటితో ప్రజల ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరం.
మిషన్ భగీరథ మంచినీరు కలర్ మారి దురు వాసన.
ప్రమాదం లో ప్రజలు ఆరోగ్యం.
మంచి నీటి అవసరాలకు వైరా రిజర్వాయర్ కు సాగర్ జలాలు విడుదల చేయాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు.
వైరా:- వైరా రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న మంచి నీరు కలర్ మారి దుర్వాసన తో కూడి వస్తున్నాయి,
అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు.
ఆదివారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్ లో కలుషితం మైన నీరు మీడియా కి వివరించారు,ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత పది రోజులుగా వైరా మున్సిపాలిటీ,
మండల పరిధిలో కలర్ మారి దుర్వాసన తో కూడి మంచి నీరు సరఫరా అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు,
వైరా రిజర్వాయర్ నుంచి 12 మండలాల ప్రజలకు మంచి నీరు సరఫరా అవుతున్నది అని అన్నారు, వైరా రిజర్వాయర్ నీటి మట్టం 7 అడుగులు పడిపొయిన ప్రభుత్వం సాగర్ జలాలు విడుదల చేయలేదని అన్నారు,
మే నెలకు మరింత గా నీటి మట్టం తక్కువ అయి మిషన్ భగీరథ మంచినీరు సరఫరా జరగడం సాద్యం కాదని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు పరిశుభ్రమైన మంచి నీరు సరఫరా చేయాలంటే వైరా రిజర్వాయర్ కు సాగర్ జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, నాయకులు తూము సుధాకర్, సంక్రాంతి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments