పెద్దపల్లిలో త్రిముఖ పోటీ...!

Rathnakar Darshanala
పెద్దపల్లిలో త్రిముఖ పోటీ...!
దూసుకుపోతున్న భారస, కార్మిక బిడ్డకు పెరుగుతున్న ఆదరణ! 


(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి రామగుండం) 

జరుగుతున్న పార్లమెంటు సమరంలో తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా ప్రతిష్టాత్మకంగా భావించిన అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని భాజపా,

 బారాస పార్టీలు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి, పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కనిపిస్తుంది,

 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు, 

పెద్దపల్లి పార్లమెంటులో ని పెద్దపల్లి రామగుండం , చెన్నూరు మంచిర్యాల లక్షెట్టిపేట బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు, ఇదిలా ఉంటే బారాస అభ్యర్థి స్థానిక కార్మిక బిడ్డగా పెద్దపల్లి పార్లమెంటు స్థానిక వ్యక్తిగా ఇక్కడి ప్రజల్లో ఆదరాభిమానాలు పొందిన మాజీ మంత్రి బారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు, 

అధికార కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలకు గుండెల్లో గుబ్బెల్ మనమిచ్చే రీతిలో గులాబీ జెండా పెద్దపల్లి కోటలో గత ఎన్నికల్లో గెలిచిన మాదిరిగానే ఈసారి సైతం గెలిపించుకోవాలనే లక్ష్యంతో ప్రజల మద్దతు కార్మికుల కర్షకుల మహిళల యువకుల ఆదరభిమానాలను పొందుతూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం లో కొప్పుల ఈశ్వర్ గెలుపే లక్ష్యంగా ప్రజల్లో దూసుకుపోతున్నారు,
 ప్రజలు సైతం వలస వాదులపై వ్యతిరేకత ఉండటంతో స్థానిక వ్యక్తినే గెలిపించాలని సంకల్పంతో కొప్పుల ఈశ్వర్ కి అండగా నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు, కార్మిక బిడ్డ కు పారిశ్రామికవేత్తలకు జరుగుతున్న పోరులో కార్మిక బిడ్డను ప్రజలు అప్పున చేర్చుకుంటున్నారు.

 మొదటి నుంచి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం వలసవాదులకు అడ్డాగా మారిందని స్థానికులు కన్నెర్ర చేస్తున్నారు, వలస వాదులను.

 ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించేది లేదని ప్రజలు భీష్మించుకోవడంతో దీనిని అదునుగా భావించిన స్థానిక కార్మికునిగా పట్టుకున్న ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే ఆత్మీయత కలిగిన బారాసా అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రజలను తమ వైపు మళ్ళించుకోవడంలో సఫలీకృతం అవుతున్నారు ఆయన నినాదం సైతం వలస వాదులను తరిమి కొట్టండి స్థానిక మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి పార్లమెంటులో నా గళం వినిపిస్తా నా ప్రజల పక్షాన అంటూ కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో గనులపై కార్మిక వాడల్లో కర్షకుల గుండెల్లో చొర్చుకొని పోతుంది ప్రచారం నిర్వహిస్తున్నారు, 
పెద్దపల్లిలో పోటీ త్రిముఖంగా కనిపిస్తున్నప్పటికీ బారాస వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది, ఏది ఏమైనా పెద్దపల్లిలో గులాబీ జెండాను రెపరెపలాడించాలని లక్ష్యంతో బారాస పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ రామగుండం శాసనసభ్యులు సైతం తనదైన శైలిలో తన రాజకీయ గురువు కొప్పుల ఈశ్వర్ కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ఆయనకున్న ఆత్మీయులు ఆయన రామగుండంలో చేసిన ప్రజాభివృద్ధి ప్రజలకు విరించి ప్రతి డివిజన్లో సమావేశాలు నిర్వహిస్తూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో బారాస సైన్యాన్ని చైతన్య పరుస్తూ తనదైన శైలిలో తన రాజకీయ గురువు కొప్పుల ఈశ్వర్ గెలుపే లక్ష్యంగా తన ప్రచారం నిర్వహిస్తూ కోరు కంటి చందర్ ముందుకు పోతున్నారు,

 ఇదిలా ఉంటే కొప్పుల ఈశ్వర్ మరో ప్రియ శిష్యుడు పెద్దపల్లి జాగృతి అధ్యక్షుడు స్థానిక కార్పొరేటర్ పెంట రాజేష్ సైతం తనదైన శైలిలో తన రాజకీయ గురువు కోసం ప్రచారం ఉదృతం చేసి సంస్కృతి సాంప్రదాయాలకు జాగృతి చేసిన జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ పెంట రాజేష్ కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు, 

ఏది ఏమైనా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే లక్ష్యంగా గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఏడు నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటంతో దాన్ని అదునుగా వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు ఇది ఇలా ఉంటే వంశీకృష్ణకు మాదిగ కులస్తులు సహకరించడం లేదు అనేది బహిరంగ రహస్యమే!

 మొదటి నుంచి పెద్దపల్లిలో మాదిగలు అన్యాయం జరుగుతుందని తమకు టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుకున్నప్పటికీ టికెట్ దాకపోవడంతో బహిరంగంగా ప్రెస్ మీట్ ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లు వేయమని తెగేసి చెబుతున్నారు, 

ఈ నేపథ్యంలో మాదిగల ఓట్లను సైతం స్థానిక అభ్యర్థి అయిన కొప్పుల ఈశ్వర్ కార్మిక బిడ్డగా తమ వైపుకు మరలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు, 

ఇక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చేపట్టిన పథకాలను సంకల్ప పేరుతో ప్రజల వివరిస్తూ ముందుకు పోతున్నారు ఏది ఏమైనా పెద్దపల్లిలో త్రిముఖ పోటీ కనిపిస్తున్నప్పటికీ బారాస గెలుపు వైపే పెద్ద పెళ్లి ఓటర్లు నిలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా ఎన్నికల వరకు గెలుపు ఓటములు ఎవరిని వరిస్తాయి అనేది వేచి చూడాల్సిందే!
Comments