కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

Rathnakar Darshanala
కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి రామగుండం)

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ప్రధాన ఆలయ పూజారి బూర్ల గణేష్ అర్చకులు నూతి అంబాదాస్ నెల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

కాకతీయ నగర్ వాసులతోపాటు గోదావరిఖని ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారి కుటుంబాలు చల్లంగా ఉండేలాగా ఆ ఆంజనేయస్వామి విజయం చెందిన రోజుగా అందరికీ విజయాలు కలిగే రీతిలో ప్రతి కుటుంబంలో అనార్థాలు తొలగిపోయి విజయాలు చేకూరాలని 

బూర్ల గణేష్ నూతి అంబాదాస్ నెల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి కుటుంబాలు పిల్లలు తమ నివసిస్తున్న గ్రామాలు పాలిస్తున్న పాలకులు అందరూ బాగుండాలని వేడుకున్నారు.

 ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి ఎల్లయ్య యాదవ్ పాల్గొని తమ డివిజన్ ప్రజలు వారి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, 

ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, ప్రధాన అర్చకుడు బూర్ల గణేష్ ఆంజనేయ స్వామి చరిత్ర వివరిస్తూ శ్రీరాముడు పట్టాభిషేకం సాక్షిగా ఆంజనేయుడు రామునికి అండగా ఎలా ఉన్నాడు పాటలు పాడుతూ కొండగట్టు అంజన్న అంటూ ప్రజలను చైతన్య పరిచే విధంగా పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామి దీవెనలు అందించారు,
Comments