కొణిజర్లలో బీజేపీ అభ్యర్థి వినోద్ రావు రోడ్ షో కు అపూర్వ స్పందన.

Rathnakar Darshanala
కొణిజర్లలో బీజేపీ అభ్యర్థి వినోద్ రావు రోడ్ షో కు 
అపూర్వ స్పందన.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని వైరా అసెంబ్లీ సెగ్మెంట్ కొణిజర్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సోమవారం సాయంత్రం నాడు  నిర్వహించిన ప్రచార రోడ్ షోకు అపూర్వ స్పందన లభించింది. 

అడుగడుగునా నేతలు, కార్యకర్తల నినాదాలతో బీజేపీ పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారి కాన్వాయికి స్వాగతం పలికారు. 

మండే ఎండను లెక్క చేయకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ గారు,

 అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్చార్జ్ రుక్మారావు గారి పర్యవేక్షణలో వందలాది కార్యకర్తల ఈ రోడ్ షో లో పాల్గొన్నారు. 

కొణిజర్ల సెంటర్లో కార్యకర్తలను ఉద్దేశించి తాండ్ర వినోద్ రావు గారు మాట్లాడుతూ- దేశంలో రాబోయే తరాలు సురక్షితంగా ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు దొరకాలంటే, చదువు-వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ గారి పరిపాలన రావాలని అన్నారు. 
ఖమ్మం జిల్లా అభివృద్ధి జరగాలంటే ఇప్పటివరకు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు వచ్చే మే 13 వ తారీకున జరిగే ఎన్నికలలో తనకు ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. 

తనను గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి చేసి చూపిస్తానని, తనకు ఓటేస్తే మోడీ జీకి ఓటేసినట్లేనని, తాను గెలిస్తే మోడీ గెలిచినట్లేనని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, రాష్ట్ర సీనియర్ నాయకులు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు తుప్పటి మల్లిఖార్జున్,జిల్లా కార్యదర్శి బండారు నరేష్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు చావా కిరణ్, యువ మోర్చ మండల అధ్యక్షులు సోమ దరియా సింగ్, మరియు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
Comments