రేపు ఉదయం 10 గంటలకు శ్రీవారి టికెట్లు విడుదల
By
Rathnakar Darshanala
రేపు ఉదయం 10 గంటలకు శ్రీవారి టికెట్లు విడుదల
నేటి వార్త తిరుమల :
తిరుమల శ్రీవారి జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 కోటా) టికెట్లను టీటీడీ రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
అలాగే జులై నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లను కూడా ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.
అటు వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి.
Comments