పేకాట ఆడుతున్న 18 మంది పట్టుకున్న పోలీస్ లు.
By
Rathnakar Darshanala
పేకాట ఆడుతున్న 18 మంది పట్టుకున్న పోలీస్ లు.
జగిత్యాల నేటి వార్త /ఏప్రిల్ 20: కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామ శివారులో పేకాట శిబిరంపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు.
పేకాట ఆడుతున్న 18 మందిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.
వారి వద్ద నుంచి రూ.1,51,000 నగదు, 18 సెల్ ఫోన్లు, 5 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Comments