పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు పునియోగించుకోవాలి కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్.

Rathnakar Darshanala
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు పునియోగించుకోవాలి కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్.
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి)
రామగుండం నియోజకవర్గం ఏప్రిల్ 19 :

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తప్పనిసరిగా  ఓటు హక్కు వినియోగించుకోవాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ శ్రీకాంత్ కోరారు. 

రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో శుక్రవారం  ప్రభుత్వ వైద్య కళాశాల , ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థ ప్రాంగణాల్లో వేర్వేరుగా స్వీప్ పై అవగాహన కార్యక్రమాలు  నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం , వర్గం , కులం , జాతి , భాష  ప్రలోభాలకు, ఒత్తిడులకు లోను  కాకుండా నిర్భీతిగా , నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు.

 ప్రతి ఎన్నికల్లో తాము నిర్భయంగా ఓటు వేయడంతో పాటు తమ తల్లిదండ్రులను , ఉపాధ్యాయులను , 

బంధుమిత్రులను ఓటు హక్కు వినియోగించుకునేలా అభ్యర్థిస్తామని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగులు , కార్మికులతో ఈ సంధర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.
Comments