Tg :కేజీ మామిడి పండ్లు రూ.3 లక్షలు.
By
Rathnakar Darshanala
Tg :కేజీ మామిడి పండ్లు రూ.3 లక్షలు.
ఫలించిన మధురం... లక్షలలో ఆదాయం.
ఒంగోలు స్టాప్ రిపోర్టర్ ( నేటి వార్త) మే 5.
ఈ సీజన్లో మనకు లభించే అనేక రకాల పండ్ల లో మామిడిపండు ఒకటి. పండ్లల్లో రారాజుగా పిలిచే బింగినపల్లి కి మంచి గిరాకీ ఉంటుంది.
రుచికి కూడా ఎంతో మధురంగా ఉంటుంది. అయితే జపాన్ మియాజాకీ మామిడి పండ్లు..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పళ్ళు.
ఇవి ఇప్పటి వరకు అన్ని చోట్లా పండిన దాకలాలు లేవు. జపాన్ తర్వాత కాలిఫోర్నియాలో మరికొన్ని చోట్ల మాత్రమే పండేది.కానీ ఖమ్మానికి చెందిన ఓ రైతు చొరవ వల్ల ఈ మియాజాకీ మామిడి తెలంగాణకు వచ్చింది.
కరోనా టైమ్ లో మియాజాకీ మామిడి పండు గురించి తెలుసుకున్న ఖమ్మం రైతు దానిని కాలిఫోర్నియా నుంచి తెప్పించి ఇక్కడ వేశారు.
మూడేళ్లు పాటూ దాన్ని అత్యంత శ్రద్ధగా పండించుకుని వచ్చారు. ఒక్కో మొక్కను అక్షరాలా 12 వేల రూపాయలు వెచ్చించి మరీ 30 మొక్కలను దిగుమతి చేసుకున్నాడు.
2020లో నాటిన ఈ మొక్కలు ఇప్పుడు బంగారు పంటను పండిస్తున్నాయి.
అతని కష్టం ఫలించింది. లాస్ట్ ఇయర్ నుంచి మామిడి చెట్లు కాపు మొదలెట్టాయి. 2024లో ఒక్కో చెట్టుకు 30 పళ్ళు వస్తే..ఈ ఏడాది 80 దాకా కాశాయి.
అవి ఒక్కోటి దాదాపు 500 గ్రాములు ఉన్నాయి. ఇతర మామిడి జాతి కంటే ఇవి నెల ముందుగానే పూత, కాత కూడా వస్తాయి.
ప్రతి సంవత్సరం నవంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఈ తోట పూతకు వస్తుందని తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఈ పండ్ల ధర కిలో 2.50 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు పలుకుతాయన్నారు.
ప్రస్తుతం ఆయన తన ఇంట్లో వాళ్ళు తినగా మిగిలిన మామిడి పళ్ళను బయట అమ్ముతున్నారు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు (సి, ఇ, ఎ, కె).. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ మియాజాకీ మామిడి రకం మొట్టమొదటగా 1984లో జపాన్లోని మియాజాకి ప్రాంతంలో పండించబడింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
Comments