AP :ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన.సీఎం వైఎస్ జగన్.
By
Rathnakar Darshanala
ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన.సీఎం వైఎస్ జగన్.
గత ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ కొత్తగా మరిన్ని పథకాలను చేర్చిన వైనం
జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ఆసజనకంగా ఉందని నేతల ఆశాభావం వెల్లడి
నేటి వార్త ఏప్రిల్ 27 స్టేట్ బ్యూరో :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను శనివారం విజయవాడలోవిడుదల చేశారు వీటిలో భాగంగా - అమ్మఒడి, రైతు భరోసా నగదు పెంపు.
ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా కింద నగదును పెంచుతున్నట్లు ప్రకటించారు.
మూడు రాజధానులపై జగన్ కీలక ప్రకటన చేశారు. -2024* వివరాలు:
2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో
విద్య, వైద్యం,వ్యవసాయానికి ప్రాధ్యానత ఇస్తూ మేనిఫెస్టో రూపకల్పన
మహిళలు, అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద గతంలో రూ. 75 వేలుగా ఉండేది. ఈసారి కూడా ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తామని జగన్ తెలిపారు.
వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మరో నాలుగు ధపాల కింద డబ్బులు ఇస్తాం
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మూడు దఫాలు ఇచ్చాం. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తాం.
జగనన్న అమ్మఒడి కింద రూ. 15 వేలు ఉండేది. ఈసారి రూ. 17 వేలకు పెంచుతామని ప్రకటన
సున్నా వడ్డీ కింద రుణాల మాఫీ స్కీమ్ కొనసాగుతుంది.
వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ ముబారక్ స్కీమ్ ను కొనసాగిస్తామని జగన్ తెలిపారు.
వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేల పెంపు,
వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు,
వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంచుతామని జగన్ ప్రకటించారు.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ స్కీమ్ కొనసాగింపు ఉంటుంది.
లారీడ్రైవర్లకు కూడా వాహనమిత్ర - రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.
వైఎస్ఆర్ లా నేస్తం కొనసాగింపు ఉంటుంది.
వైఎస్ఆర్ రైతు భరోసా రూ. 16వేలకు పెంపు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేస్తామని జగన్ ప్రకటన.
రాష్ట్రంలో తలపెట్టిన 12 కొత్త మెడికల్ కాలేజీలను వేగంగా పూర్తి చేస్తాం.
కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తాం.
దళితుల జనాభా 500కి పైగా ఉంటే ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటన.
దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధులు.
అప్కో బకాయిలను ఈ దఫా కూడా కొనసాగిస్తాం.
కాపు సంక్షేమం కోసం వైసీపీ పాలనలో రూ. 34వేల కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో మరింత సంక్షేమం చేస్తాం.
ఔట్ సోర్సింగ్ కింద రూ. 25వేల వరకు జీతం పొందే ఉద్యోగులకు విద్య,
వైద్యానికి సంబంధించిన నవరత్నాల స్కీమ్ లను వర్తింపజేస్తారు.
వైఎస్ఆర్ బీమా స్కీమ్ కింద ఆన్ లైన్ లో పుడ్ ఆర్డర్స్ ను సప్లయ్ చేసే వారికి వర్తింపజేస్తారు.
బోగాపురం పోర్టు పనులను మరింత వేగంగా పూర్తి చేస్తామని జగన్ ప్రకటన.
వచ్చే ఐదేళ్లలో సురక్షితమైన తాగు నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం.
వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే… విశాఖపట్నం నుంచి పాలన ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని జగన్ కీలక ప్రకటన చేశారు.వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం అని మేనిఫెస్టో విడుదల చేశారు.
Comments