రెచ్చి పోతున్న మట్టి మాఫియా... మమ్ముల మత్తులో అధికారులు.?

Rathnakar Darshanala
రెచ్చి పోతున్న మట్టి మాఫియా... మమ్ముల మత్తులో అధికారులు.?
3 జెసిబి,40ట్రాక్టర్ల తో ఎర్రమట్టి దందా.

*కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం*

*అధికార పార్టీ నాయకులే అండ*

*లక్షల్లో ఎర్రమట్టి తరలింపుకు ఒప్పందం*

*ముందుగానే అందుతున్న సంచారం వెనుక ఉన్నది ఎవరు*

అశ్వారావుపేట ( నేటి వార్త)


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం

దమ్మపేట మండలంలో ఎర్రమట్టి దందా మూడు జెసిబి లు,40ట్రాక్టర్లు అన్నట్టు జోరుగా సాగుతుంది.దమ్మపేట మండల రెవెన్యూ పరిధిలోని మందలపల్లి పంచాయితి పరిధిలో గత 3రోజులుగా అర్ధరాత్రి సమయంలో 3జెసిబి,40ట్రాక్టర్ల సాయంతో ఓ పచ్చని కొండని తొలగించి ఎర్రని బీడు భుమిగా మార్చేశారు.

రెవెన్యూ కార్యాలయం,పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఇంత భారీ సంఖ్యలో అక్రమ మట్టి రవాణా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించటం గమనార్హం.ఈ తతంగం అంత రాజకీయ నాయకుల అండదండలతో నడుస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే కు సదరు వ్యక్తుల చరిత్ర అంతా తెలిసినప్పటికీ గడిచిన ఎన్నికల్లో వెనకేసుకు తిరగడంతో పాటు భవిష్యత్తులో అండగా ఉంటా అని బరోసా ఇవ్వటంతో సదరు వ్యక్తి భుదందా కు తెరలేపినట్టు తెలుస్తుంది.
అందులోనూ తన అభిమాన నాయకుడు సైతం మంత్రి హోదాలో ఉండటంతో తనను ఏమీ చేయలేరు అని తనకు అడ్డొస్తే భవిష్యత్ లో మీ సంగతి చూస్తా అని వార్నింగ్ లు ఇస్తుండటంతో సామాన్యులు ఏమీ చేయలేక స్థానిక ఎమ్మెల్యే నే దిక్కు అని వేడుకునేందుకు స్థానికులు సిద్దం అవుతున్నారు.

పిర్యాదు చేసే నాధుడే లేక అటు మైనింగ్ శాఖ కానీ రెవెన్యూ,పోలీస్ యంత్రాగం అటువైపు కన్నెత్తి చూడటం లేదు అనే వాదన వినిపిస్తోంది.ఇప్పటికే పెద్ద మొత్తంలో ప్రైవేట్ భూముల్లోకి మట్టిని తరలించేందుకు  లక్షల్లో ఒప్పందం చేసుకొని స్థానికంగా ముగ్గురు జెసిబి యజమానులతో కలిసి 40ట్రాక్టర్ లలో ప్రైవేట్ వ్యక్తుల వెంచర్లకు మట్టిని తరలిస్తూ లక్షల్లో జేబులు నింపుకుంటున్నరు.

ఈ అక్రమ రవాణాకు అడ్డుతగిలిన వారిని నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తూంది.అయితే గతరాత్రి మాత్రం స్థానికులు దైర్యం చేసి పోలీసులకు,రెవెన్యూ అధికారులకు ఫోన్ చేయటంతో ట్రాక్టర్ల యజమానులు భయంతో పరుగులు పెట్టారు.

ఈ భూదందా వార్త మండల కేంద్రంలో పెద్దయెత్తున హల్చల్ చేసినప్పటికీ స్థానిక పోలీస్,రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించాక పోవటం,కనీసం జరిగిన విషయంపై తమకేమీ పట్టదు అన్నట్టు వ్యవహరించటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Comment Poster
Nice article