సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం.
By
Rathnakar Darshanala
సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం.
గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు.
(జేమ్స్ రెడ్డి)
నేటి వార్త ప్రతినిధి రామగుండం నియోజకవర్గం జనవరి 6
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం తో సైబర్ నేరాలు సైతం అదే విధంగా పెరిగిపోయాయని
వీటిపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు.
ఈ మేరకు శనివారం మండల న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యం లో మార్కండేయ కాలనీ లోని శ్రీ. కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.యువత ఇటీవల స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగి పోయిందని అన్నారు.
సైబర్ నేరగాళ్లు తప్పుడు లింక్ లు పంపి డబ్బులను మనకు తెలియకుండానే కాజేస్తారన్నారు.
అంతేకాక సోషల్ మీడియ లో మనం పెట్టే ఫోటోలను మార్పింగ్ చేసి కొంతమంది ఆకతాయిలు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతారన్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ వాడేవారంతా నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.
అదేవిధం గా ఇటీవల యువత మద్యపానానికి బానిసగా మారి విలువైన జీవితాన్ని బుగ్గిపాలు చేసికుంటుందని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలు కోనీ తెచ్చుకొని తమ విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారన్నారు.యువత మద్యపానానికి,దూరంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకన్న,న్యాయవాదులు సి .హెచ్.శైలజ,తౌటం సతీష్,సోషల్ వర్కర్ ఎమ్.శంకర్, మండల లీగల్ వాలంటీర్ సుజాత కళాశాల విద్యార్థులు ,సిబ్బంది పాల్గొన్నారు.
Comments