అంగన్వాడీల కనీసం కనీస వేతనం అమలు చేసే వరకు సమ్మె ఆపేదే లేదు సిఐ టియు.

Rathnakar Darshanala
అంగన్వాడీల కనీసం కనీస వేతనం అమలు చేసే వరకు సమ్మె ఆపేదే లేదు  సిఐ టియు.


 నేటి వార్త గోస్పాడు 
 డివి సుబ్బయ్య

సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏసు రత్నం

అంగన్వాడీల కనీస వేతనం అమలు చేసేంతవరకు సమ్మె ఆపేదే లేదు సమ్మెను మరింత ఉదృతం చేస్తామని చీపుర్లు,బకెట్లు,మగ్గులు,సబ్బులు,ఫినాయిల్ ఇస్తున్నాం కదా సమ్మె విరమించండి అని అడగడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి.

అంగన్వాడీలు సమ్మె చేస్తున్నది వేతనాలు పెంచాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యుటీ చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లతో అవి తేల్చకుండా సమ్మె ఆగదు.

 సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె 25వ రోజు శుక్రవారం  స్థానిక గోస్పాడు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం నికి ముఖ్యఅతిథిగా
సిఐటియు జిల్లా అధ్యక్షులు వి, యేసురత్నం జిల్లా కార్యదర్శి వి, బాల వెంకట్ ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు డి, నిర్మలమ్మ లు మాట్లాడుతూ 
25 రోజులుగా రోడ్డున పడి సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా అంగన్వాడీలపై అబద్ధాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు.

ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో ప్రజల చెవిలో పూలు పెడుతున్నదని అందుకే  ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిరసన తెలుపుతున్నామన్నారు. ఇప్పటికే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదని అంగన్వాడీల సమస్యలు అన్నీ పరిష్కరించాము విధులలో చేరాలని ఒక అధికారి అంటున్నారని ఇది ప్రజలలో అంగన్వాడీలపై వ్యతిరేక భావనను ప్రచారం చేయడంలో భాగమని అన్నారు.

ప్రధాన డిమాండ్లపై తేల్చకుండా చివరి ఒకటి,రెండు డిమాండ్లను పరిష్కరించినంత మాత్రాన సమ్మె ఎలా ఆగుతుందని మరోవైపు పలానా సమయంలో గా ఉద్యోగాలలో చేరకుంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని రాజకీయ నాయకుల లాగా ఉన్నతాధికారులు అంగన్వాడీలపై తప్పుడు ప్రచారాలు చేయడం,బెదిరింపులకు పాల్పడడం బాధాకరమని వారి లాగా అంగన్వాడీలకు లక్షల్లో వేతనాలు రావడం లేదని ఏది ఏమైనా వారి తాటాకు చెప్పులకు భయపడేది లేదని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ప్రధాన డిమాండ్లపై తేల్చకుండా సమ్మెను ఆపే ప్రసక్తే లేదని ఇంకా ఉధృతం  చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నంద్యాల ప్రాజెక్టు నాయకురాలు రమణమ్మ, సువర్ణమ్మ, రుక్మిణి, నాగలక్ష్మి, ఆదిలక్ష్మి, భూలక్ష్మి తోపాటు వందమంది అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.
Comments