ఘనంగా నాగోబ జాతర ను నిర్వహించాలి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

Rathnakar Darshanala
నాగోబ జాతరను ఘనంగా... సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
* అధికారులను అదేశించిన జిల్లా కలెక్టర్.

      గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబ జాతరను ఘనంగా, సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశించారు.

                    ఫిబ్రవరి నెల 9 నుండి 15 వరకు నిర్వహించనున్న జాతర ఏర్పాట్లపై గురువారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ దర్బార్ హాల్ లో ITDA ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ముందుగా కలెక్టర్, పిఓ నాగోబా దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
      
           ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న జాతర ఏర్పాట్లను కలెక్టర్, పిఓ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 
అనంతరం దర్బార్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

          జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున శానిటేషన్, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడం నిరంతరం జరగాలని, వీధి లైట్లు, హైమాస్ లైట్ లను ఏర్పాట్లు చేయాలని పంచాయితీ అధికారులకు సూచించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు 104, 108 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచి నిరంతర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని అందుబంటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు.

             నీటి సరఫరా సక్రమంగా జరగాలని, మరుగుదొడ్లు అవసరమైన మేరకు ఏర్పాటు చేయాలనీ RWS అధికారులను ఆదేశించారు. బారికేడ్స్ ఏర్పాటు చేసి దర్శనానికి పురుషులు, మహిళలకు వేరువేరుగా ప్రవేశం కల్పించాలన్నారు.

    జాతరకు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 24/7 పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలనీ పోలీస్ అధికారులను ఆదేశించారు. మర్రి చెట్టు ప్రాంతం, గోవాడ, దేవాలయ ప్రాంగణ సమీపంలోని మట్టిని చదును చేయాలనీ, దేవాలయ నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని ఇంజనీరింగ్, విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

         గిరిజన సాంప్రదాయ పూజ కార్యక్రమాలకు అవసరమైన పూజ సామాగ్రి, విద్యుద్దీకరణ, వంటి పనులను దేవాదాయ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు.

ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ, నాగోబ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల వంటి ఏర్పాట్లతో పాటు భక్తులు, ప్రముఖులు, అధికారులకు అవసరమైన భోజన వసతి కల్పించాలని ఆదేశించారు.

    అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ నిర్దేశించిన గడువులోగా కేటాయించిన పనులను పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక బస్ లు సైతం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అధికారులు తెలిపారు.

ఈ సమావేశం లో DSP నాగేందర్, సర్పంచ్ రేణుక, కమిటీ చైర్మన్ తుకారాం, ఆలయ పీఠాధిపతి వెంకట్రావు, ఈఓ రాజమౌళి, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ఆలయం నిర్వాహలు. గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు.
Comments