భాజపా అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
By
Rathnakar Darshanala
భాజపా అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
రాజేంద్రనగర్ అభివృద్ధి చెందాలంటే భాజపానే రావాలి.
భాజపారాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్.
రాజేంద్రనగర్ (నేటి వార్త న్యూస్) భాజపా పార్టీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని భాజపా రాష్ట్ర నాయకులు బు క్క వేణుగోపాల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం భాజపా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ఓటర్లకు తెలిపారు. పలు గ్రామాల్లో గజమాలతో ఆయనకు సన్మానించి టపాసులు పేల్చి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మనిషిని చేతల మనిషి కాదని రాజేంద్రనగర్ నియోజకవర్గం వెనుకబడి ఉందని ఆయన అన్నారు.
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థితో కల శ్రీనివాస్ రెడ్డి యువకుడు నియోజకవర్గం మీద పట్టణ వ్యక్తి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద అవగాహన కలిగిన యువకుడని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకుంటే రాజేంద్రనగర్ నియోజకవర్గం. భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.
నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలోని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ సాధ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈసారి ప్రజలు ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే రాజేంద్రనగర్ ని రూపురేఖలు మారుస్తానని అభివృద్ధి పథంలో ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments