ఆదిలాబాద్ లో బీజేపీ భారీ ర్యాలీ.హాజరైన బండి సంజయ్.

Rathnakar Darshanala
ఆదిలాబాద్ లో బీజేపీ భారీ ర్యాలీ. హాజరైన బండి జంజయ్.
* ఆదిలాబాద్ లో బీజేపీ కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.
ఆదిలాబాద్ నేటి వార్త :
ఆదిలాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా స్టార్ క్యాంపెనర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ  రోడ్ షో సోమవారం ఆదిలాబాద్ లో జరిగింది.
ఈ కార్యక్రమం కొంత సాంకేతిక కారణాలవల్ల నిర్ధారించిన సమయానికన్నా ఆలస్యంగా ప్రారంభమయ్యింది.  హెలికాఫ్టర్ లో ఆదిలాబాద్ ప్రియదర్శిని స్టేడియంకు అక్కడి  నుండి  కాన్వాయి లో వినాయక్ చౌక్ చేరుకున్నారు. అభిమానులు కార్యకర్తల తో కలిసి ఆయన రోడ్ షో ప్రారంభించారు.

 సమయాభావం వళ్ళ అంబెడ్కర్ చౌక్ లో జరగాల్సిన అయన ప్రసంగం పాత బస్టాండ్ లో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ BRS పార్టీలు ఓట్లకోసం కుల రాజకీయాలు చేస్తూ బీజేపీ ని బద్నామ్ చేస్తున్నాయని అన్నారు. ఒక్కసారి ఈ పార్టీల మేనిఫెస్టోలు చూడండి 12% ఉన్న ఒక వర్గానికి లెక్కలేనన్ని ఆఫర్లు ఇచ్చాయి. ఒక్క సారి ఆలోచించండి అన్న కుల రాజకీయాలు ఎవరుచేస్తున్నారో మీకు అర్థం అవుతుంది అని అన్నారు.

 జోగు రామన్న ఒక సారి బీసీ మంత్రిగా ఉండి, నాలుగు సార్లు MLA గాఉండి బీసీ లకు గాని తన కులమైన మున్నూరుకాపులకు గాని ఆయన ఒరగబెట్టింది ఏమిలేదు BRS కు ఓటేస్తే మన ఓట్లు మురిగి పోతాయని అన్నారు.  ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జోగు రామన్న కొడుకు ఛైర్మెన్ గా ఉన్నాడు కానీ అధికారం ఎవడు చలయిస్తున్నడు మన అందరికి తెలిసిందే మన హిందూ సోదరుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మీ అందరికి తెలిసిందే అన్ని అన్నారు .ఈ రోడ్ షో లో MLA అభ్యర్థి పాయల్ శంకర్ గారు జిల్లా నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు. 

 ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలిక్యాప్టెర్ దిగిన వెంటనే బీసీ సంఘం కి చెందిన నాయకులు బీసీ సంఘం నాయకులు ఈరోజు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బిజెపిలో చేరడం జరిగింది
Comments