బడుగుల సంక్షేమం, అభివృద్ధే జగనన్న ధ్యేయం.
By
Rathnakar Darshanala
బడుగుల సంక్షేమం, అభివృద్ధే జగనన్న ధ్యేయం.
*ఎస్సీల భవితకు విద్య, సంక్షేమంతో ఉజ్వల భవితకు శ్రీకారం–
డిప్యూటీ సీఎం నారాయణస్వామి*
*మైనార్టీలను చేయి పట్టుకు నడిపించిన జగనన్న – డిప్యూటీ సీఎం అంజాద్ బాషా*
*సామాజిక సాధికారతను సాకారం చేసింది సీఎం జగన్ ఒక్కరే –
మంత్రి విడదల రజని*
*జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.7,984 కోట్ల లబ్ధి–
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి*
నేటి వార్త స్టేట్ బ్యూరో నవంబర్ 20
ఏపీలోనివైయస్సార్ కడప జిల్లా మైదుకూరులో సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. కేసీ కెనాల్ మీదుగా కార్ల ర్యాలీ జరిగింది. మధ్యాహ్నం 3.45 నిమిషాలకు ప్రొద్దుటూరు రోడ్‌లో అశేష జనవాహిని మధ్య, స్థానిక ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది.
సభలో ఎంపీ అవినాశ్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు అంజాద్‌భాషా, నారాయణస్వామి, మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లతో పాటు వివిధ కార్పొరేషన్ల నాయకులు, జెడ్పీ ఛైర్మన్, జెడ్పీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
బస్సు యాత్ర అనంతరం బహిరంగ సభలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు.. గెలిచాక ఏం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ ఏం హామీ ఇచ్చారు. ఏం చేశారనేది ప్రజలు ఆలోచించుకోవాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి పేర్కొన్నారు.
చంద్రబాబు గెలిచాక ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో 26 మంది మంత్రులు ఉంటే అందులో 9 మంది మాత్రమే బీసీలు, మైనారిటీ ఒక్కరు కూడా లేరన్నారు. ఎస్టీలకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదన్నారు.
ఆయన సొంత కులం కమ్మ వారికి మాత్రం 6 మంత్రి పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. మన ప్రభుత్వంలో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే ఇచ్చారన్నారు.
సచివాలయ వ్యవస్థ తెచ్చి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, వాటిలో 83 శాతం ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమేనని, ఎన్నికలు దగ్గరికి వస్తున్న క్రమంలో ప్రజలు మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు అండ్ కో సిద్ధమైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో బడుగు,బలహీన వర్గాలకు సమున్నత గౌరవం దక్కిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా జిల్లాలో రూ.12,061 కోట్ల లబ్ధి చేకూరిందని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.7,984.48 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా అందాయని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి వివరించారు.
*ఎస్సీల భవితకు విద్య, సంక్షేమంతో ఉజ్వల భవితకు శ్రీకారం– డిప్యూటీ సీఎం నారాయణస్వామి*
తాను ఎస్టీని, ఒక దళితుడినని చదువులు కూడా చెప్పించలేని ఒక కుటుంబంలో జగనన్న బడుగులకు ఇచ్చే ప్రాధాన్యాత వల్లే డిప్యూటీ సీఎం అయ్యాననని నారాయణ స్వామి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లలో బడుగు బలహీనవర్గాలకు ఏం మేలు జరిగింది? జగనన్న నాలుగున్నరేళ్లలో ఎంత మంచి జరిగింది? అని ఆలోచిస్తే..ఆయనకు మనమెంతగా రుణపడిపోయామో తెలుస్తుందన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారి స్థాయిని పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. చంద్రబాబు తన హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఎంత చులకనగా చూశారో, ఎన్ని అవమానాలు చేశారో చూశామని ఎన్నికల కోసం చంద్రబాబు చెబుతున్న మాయమాటలు నమ్మితే నిండా మునగుతామన్నారు.
చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల సామాజికస్థాయి, ఆర్థిక ఉన్నతి పెంచిన అసలు సిసలైన ప్రజానాయకుడు జగనన్న అని కొనియాడారు.
*మైనార్టీలను చేయి పట్టుకు నడిపించిన జగనన్న – డిప్యూటీ సీఎం అంజాద్ బాషా*
దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగానే మిగిలిపోయిందని మన రాష్ట్రంలో జగనన్న పాలన వచ్చాక సామాజిక సాధికారత అన్నది ఒక విధానంగా మారిందని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా లన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులంతా ఒకే వేదికపైకి ఎక్కడం, మాట్లాడటం మన మెప్పుడైనా చూశామా? ఇప్పుడు చూస్తున్నామన్నారు.
మైనారీల్టకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం చంద్రబాబుదైతే ఈ రోజు జగనన్న వల్ల నలుగురు మైనార్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరని ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఒక మైనార్టీ ఉన్నాడన్నారు. మైనార్టీ సామాజికవర్గానికి అనేక రకాలుగా ఎంతో మేలు చేసిన జగనన్నను మళ్లీ గెలిపించుకోవడం మన బాధ్యత, కర్తవ్యమన్నారు. ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన బతుకులు బాగుంటాయి. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నారు.
*సామాజిక సాధికారతను సాకారం చేసింది సీఎం జగన్ ఒక్కరే – మంత్రి విడదల రజని*
జగనన్న కటౌట్ పెడితేనే ఇంత మంది తరలివచ్చారంటే.. ఆయనపై మీకెంత అభిమానం ఉందో అర్థమవుతోందని మంత్రి విడదల రజిని అన్నారు. కడపలోని ప్రతి గడప గర్వపడేలా నాడు వైఎస్సార్, నేడు జగనన్న పాలన ఉందన్నారు. రాష్ర్టంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి చరిత్రను తిరగరాసారన్నారు.
నాడు–నేడు పేరిట వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని 96 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తోందపి మంత్రి అన్నారు. జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, ఫించన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, షాదీతోఫా, జగనన్న తోడు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సంక్షేమ పథకాలు మనకోసం తీసుకొచ్చారని పేర్కొన్నారు.
*సామాజిక సాధికార యాత్ర మాత్రమే కాదు ఇది సామాజిక విప్లవ బావుటా.. ఎస్సీ సెల్ అధ్యక్షులు, జూపూడి ప్రభాకర్*
రాష్ర్టంలోని ప్రతి వర్గం, ప్రతి కులానికి చెందిన ప్రజలు వ్యక్తత్వంతో, ఆత్మగౌరవంగా జీవించాలంటే జగన్ మళ్లీ సీఎం అవ్వాలని ఎస్సీ సెల్ అధ్యక్షులు, జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. జగనే ఎందుకు కావాలనే పుస్తకాన్ని చదివితే నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ర్టానికి ఎంత మంచి జరిగిందో ఆర్థం అవుతుందన్నారు.
చంద్రబాబు అవసరం రాష్ర్టానికి ఎందుకు లేదో ఆయన గతంలో హామీ ఇచ్చి వంచించిన మోసాలను గుర్తు తెచ్చుకుంటే అర్థం అవుతుందన్నారు. చరిత్రలో ఎన్నడూ ఎరుగని విప్తవాత్మక పరిపాలన అందించి చెప్పాడంటే చేస్తానంటే అనే నినాదంతో హామీలన్ని అమలు చేసిన జగన్ కు మన భవిష్యత్తు కోసం మనం తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు గెలిచే వరకు, వారి జీవితాలు భాగుపడేవరకు ఈ యుద్ధం కొనసాగుతుందన్నారు.
పేదవాల్ల నుంచి భూములు లాగేసుకున్న చరిత్ర చంద్రబాబుది అయితే భూమిని కలిగి ఉండటం ఒక ఆత్మగౌరవమని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ చెప్పిన మాటలను నిజం చేస్తూ అసైన్డ్ భూములపై సీఎం జగన్ పేద ప్రజలకు హక్కులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. పేదల్లో మార్పు, అభివృద్ధి కోసం సీఎం జగన్ పనిచేస్తుంటే చంద్రబాబు మాత్రం తన పెత్తం దారులను మరింత పెద్దోళ్లను చేయడానికి పనిచేశారని విమర్శించారు.
చంద్రబాబు నోట్లో ఒక్క రోజైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాట వచ్చిందా అని ప్రశ్నించారు. రాజకీయ సాధికారత ఇచ్చి బడుగు వర్గాలకు వేదికను పంచిన జగనన్ను మళ్లీ సీఎం చేసుకోవాలని లేదంటే మనం మరింత వెనుకబడతామని జూపూడి పేర్కొన్నారు.
Comments