కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రా అభివృద్ధి.ప్రియాంక గాంధీ.

Rathnakar Darshanala
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి.

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమిలేదు.

బీజేపీ,బీఆర్ఎస్,ఎంఐఎం  ఒక్కటే.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.


ఖానాపూర్ రూరల్,నవంబర్19(నేటివార్త): కేసిఆర్,కేటీఆర్ ల ఉద్యోగాలు తిసేస్తెనే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో నిర్వహించిన సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడారు.గిరిజనులకు,ఆదివాసీలకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎంతో సేవా చేశారని,రాజకీయాల్లోకి అందరు వస్తారు కానీ కొందరే ప్రజల గుండెల్లో కొలువుంటారని ఇందిరా గాంధీని గుర్తుచేసుకున్నారు.

సీఎం కేసిఆర్ పదేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా పేపర్ లీకేజీలతో నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని,ధరణి పోర్టల్ ద్వారా భూములు లాక్కునీ,ఇసుక,లిక్కర్ మాఫియాలను బీఆర్ఎస్ పెంచి పోషిస్తుందన్నారు.కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ భగీరథల పేరుతో అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

బిజేపి, బీఆర్ఎస్,ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.ఇందిరమ్మ ఇళ్లు,10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్,యువ వికాసం పథకం,ఇంటర్ నేషనల్ స్కూల్స్,అభయహస్తం క్రింద 12 లక్షల చెల్లింపు తదితర పథకాలన్నీ అమలుచేస్తామని అన్నారు.

        కర్ణాటక తరహాలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు మహిళల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామని,యువత,నిరుద్యోగుల దృష్ట్యా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని,జాబ్ కాలెండర్ రిలీజ్ చేస్తామని అన్నారు.బిజేపి పార్టీ అయిన మోది సర్కార్ దేశానికి,రాష్ట్రానికి,రైతులకు చేసిందేమీ లేదన్నారు,

కార్పొరేట్లకు కొమ్ముకాసి,వారికి రుణమాఫీలు చేస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి,రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పిస్తామని అన్నారు.తెలంగాణ ప్రజల బాగుకై సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని,రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మాత్రం నెరవేరలేదని,ఈ ఎన్నికల్లో కేసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి,పేదప్రజల పక్షమైన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.

ఖానాపూర్ నియోజకవర్గం ఆదివాసులు,గిరిజనులు,గోండులు,అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి,అభ్యున్నతికై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.అందరు సుభిక్షంగా ఇళ్లకు చేరుకుని క్రికెట్ లో భారత్ ప్రపంచ కప్ గెలవాలని కోరుకోండి అని అన్నారు.
Comments