ఈ సారి నిన్ను గెలిపిస్తాం...అన్న.ఆదిలాబాద్ జిల్లా ప్రజలు.

Rathnakar Darshanala
ఈ సారి నిన్ను గెలిపిస్తాం...కొడకా.
* గిరిజన గ్రామాలలో పాయల్ పర్యటన.
* అడుగడుగునా పాయల్ కు బ్రాహ్మరథం పడుతున్న ప్రజలు.
* ని కష్టం ఊరికే పోదు. భారీ మెజారిటీ ఇస్తాం. గిరిజన ప్రజలు.
ఆదిలాబాద్ జిల్లా నేటి వార్త : జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. నువ్వా నేనా అంటూ ప్రచారాలు ఒరేతేస్తున్న  ప్రజాప్రతినిధులు. ఈసారి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ నే గెలిపిస్తామంటున్న అదిలాబాద్ జిల్లా ప్రజానీకం.

బుధవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ MLA అభ్యర్థి పాయల్ శంకర్ . చించుఘాట్, జండగూడ, మత్తడిగూడా, చిన్న లోకారి, బూర్నూర్ గ్రామాల్లో పర్యటించారు. ఆదివాసీల దండారి ఉత్సవాల్లో పాల్గొని వారితో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు.
      
                  అంతరం ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో జోగు రామన్న ఇల్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆదివాసీలకు పోడుభూముల పట్టాలు ఇప్పిస్తానని మోసం చేశారన్నారు. ఈ BRS ప్రభుత్వం జోగురామన్న ఆదివాసీలకు పూర్తి వ్యతిరేకం ...దేశ అత్యున్నత స్థానం లో ఒక ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తుంటే ఈ జోగురామన్న  BRS ప్రభుత్వం ఓర్వలేకపోయింది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వ్యతిరేకంగా ఓటు వేసింది.... ఆ విషయం ఆదివాసీ సమాజం మర్చిపోలేదు అన్నారు.  

        జోగురామన్న ప్రజలను మోసం చేయడం తప్పిచ్చి చేసింది ఏమిలేదు. పోడు భూములకు పట్టాలు రాలె, గిరిజన యువకులకు ఉన్నత విద్యను అందించే గిరిజన యూనివర్సిటీ రాలేదు అని అన్నారు. ఎన్నికల్లో వాగ్దానం చేయడం ఎన్నికలవ్వంగనే మర్చిపోవడం జోగు రామన్నకు అలవాటే అని అన్నారు.
       ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మండల నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments