సింహం గుర్తు తో నియోజక వర్గ చరిత్ర సృష్టిస్తా.
By
Rathnakar Darshanala
సింహం గుర్తుతో నియోజకవర్గ చరిత్ర సృష్టిస్తా అంటున్న పిల్లుట్ల రఘు
నేటి వార్త నవంబర్ 3 హుజూర్నగర్ ప్రతినిధి బండి నాగేశ్వరరావు
హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థిగా పిల్లుట్ల .రఘు పట్టణంలో వున్న ఆఫీస్ నందు 50 మంది యువకులు రఘున్న సేవా కార్యక్రమాలు చూసి అభిమానులుగా మారి స్వచ్ఛందంగా పిల్లుట్ల రఘు అన్న ఎమ్మెల్యే గెలుపుకు సహాయ సహకారాలు అందిస్తామని, పిల్లుట్ల రఘు అన్న చేసిన సేవా కార్యక్రమాలు గడపగడపకు వివరిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల కాలాల నుంచి, నియోజకవర్గంలో గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకు సేవ పరంగాను,
ప్రతి ఊరిలో పాఠశాలల అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి, నూతన దేవాలయాల నిర్మాణమునకు, అన్నదానాలకు సహకరిస్తున్నారని, ప్రతి ఊర్లో అంబేద్కర్ ఆశయాలు తెలిసే విధంగా అంబేద్కర్, తండాలలో మెరియాడి దేవాలయాలను నిర్మిస్తూ, విద్య,వైద్య,ఆరోగ్యం, ఆర్థికంగా ప్రజలను ఆదుకుంటూ, నిరుద్యోగులకు కోచింగ్ ఇప్పించి, వారి ఉపాధి అవకాశాలు చూపిస్తూ ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి ఎవరంటే పిల్లుట్ల రఘు అని అటువంటి సేవాభావం ఉన్న వ్యక్తిని ప్రజలందరూ ఆదరించి, ఆశీర్వదించి సింహం గుర్తుకు ఓటేసి పిల్లుట్ల రఘు ను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.
ప్రజలు కూడా మంచిదో చెడేదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, మంచి చేసే వారి వైపే వారు నిర్ణయం ఉండాలని పిల్లుట్ల రఘు లాంటి మంచి మనసున్న వ్యక్తినే ఎమ్మెల్యేగా గెలిపిస్తారని సింహం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని పిల్లుట్ల రఘు అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు,రఘు అన్న అభిమానులు, కార్యకర్తలు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Comments