చొప్పదండి భారీలో త్రిమూక పోటీ

Rathnakar Darshanala
చొప్పదండి భారీలో త్రిముఖ పోటీ                          మల్యాల నేటి వార్త ప్రతి నిధి నవంబర్ 3 రమేష్ దొనకొండ 

కరీంనగర్ జిల్లా నేటి వార్త :

చొప్పదండి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పాతవారే కావడంతో ఈ సారి పోటీ రసవత్తరంగా మారింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 5సార్లు ఆ పార్టీనే గెలవగా.. ఒకసారి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ ని గెలిచింది.

త్రిముఖ పోటీ..

చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కే మళ్లీ అవకాశం ఇవ్వగా, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కాంగ్రెస్ అభ్యర్థిగా మేడిపల్లి సత్యం పోటీ పడుతున్నారు. ముగ్గురు పాతవాళ్లే కావడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ గత ఐదేళ్లలో అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ముందుగానే తన సీటు ప్రకటించడంతో నెలరోజుల నుంచే ప్రచారం మొదలు పెట్టారు.

బీఆర్ఎస్ వైఫల్యాలపై ఫోకస్..

బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఆమె హయాంలోనే చొప్పదండి మండలం రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్, చొప్పదండిలో డిగ్రీ కాలేజీ మంజూరయ్యాయి. చొప్పదండి మండలం గుమ్లాపూర్ క్రాస్ రోడ్డు నుంచి రామడుగు వరకు డబుల్ రోడ్డు, చొప్పదండి మండలం రేవెల్లి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేశారు. చాలా మంది ఒంటరి మహిళలకు పింఛన్ ఇప్పించారు. ఈ పనులను గుర్తు చేయడంతోపాటు, బీఆర్ఎస్ వైఫల్యాలపై ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం 2014లో టీడీపీ, 2018లో కాం�
Comments