కాంగ్రెస్ పార్టీ మధుయాష్కీ కి బలం చేకూర్చిన మల్ రెడ్డి రామిరెడ్డి.
By
Rathnakar Darshanala
*కాంగ్రెస్ పార్టీ మధుయాష్కీ కి బలం చేకూర్చిన మల్ రెడ్డి రామిరెడ్డి*
నేటివార్త దినపత్రిక,
రంగారెడ్డి జిల్లా,
రాజేష్ కే.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్ రెడ్డి రామిరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఉమ్మడి పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్ రెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ ఇన్ని రోజులు పార్టీకి సేవలు చేశాను, అసంతృప్తిని తెలియజేసిన మాట వాస్తవమే కానీ అధిష్టానం ఈ సీటుని ఎందుకు బీసీలకు కేటాయించాల్సి వచ్చిందో వివరించి భవిష్యత్తులో పార్టీలో సముచిత స్థానం తప్పకుండా ఉంటుందని ఇచ్చిన హామీ నన్ను సంతృప్తి పరిచిందని తెలుపుతూ ఇన్ని రోజులు నాతో కలిసి పని చేసిన నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో పార్టీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు.
ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ ఇన్ని రోజులు పార్టీని కంటికి రెప్పలా పలువురు నాయకులు, కార్యకర్తలు కాపాడుకున్నారని భవిష్యత్ లో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే చార్జ్ వీరి చేతుల్లోనే ఉంటుందని,
రాజకీయాల్లో టికెట్ ఆశించడం తప్పు కాదు, అలా అని టికెట్ రానంత మాత్రాన వీరిది తక్కువ స్థాయి కాదని, ఎమ్మెల్యే టికెట్ పొందడానికి వీరికి నాకున్న సమాన అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. టికెట్ ఆశించిన నేతలను నేను ఏనాడు విమర్శించలేదని, వీరందరూ నా సోదరులని, మనమంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమని, కలిసికట్టుగా పార్టీకి ద్రోహం చేసిన సుధీర్ రెడ్డిని ఓడిద్దామని పిలుపునిచ్చారు.
మీరు ఎవరి బెదిరింపులకు భయపడద్దని మీకు అండగా నేనుంటానని, విద్యార్థి దశనుండే ఇలాంటివి ఎన్నో చూసానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గం లో అసంతృప్త నేతలందరూ ఒకే తాటి మీదికి రావడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
Comments