ఆదిలాబాద్ లో బీఅర్ ఎస్ కు బిగ్ షాక్.

Rathnakar Darshanala
ఎమ్మెల్యే జోగు రామన్న తీరు వల్లే బిఆర్ఎస్ పార్టీని వదలాల్సి వచ్చింది.బాలూరి గోవర్ధన్ రెడ్డి.
ఆదిలాబాద్ నేటి వార్త :
తెలంగాణ ఉద్యమ సమయంలో జోగు రామన్న కంటే ముందే బిఆర్ఎస్ పార్టీలో చేరిన తనను అడుగడుగునా ఎమ్మెల్యే అనగదొక్కేందుకు యత్నించాడు. మున్సిపల్ చైర్మన్... గ్రంథాలయ చైర్మన్...మార్కెట్ కమిటీ చైర్మన్...చివరకు డిసిసిబి చైర్మన్ ఇలా వివిధ 7 పదవులు ఇస్తానని చెప్పి మోసం చేసాడు అని బాలూరి గోవర్ధన్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేసారు.

మాజీ ఎంపీ నగేష్ గారి  ఎదుటే మాట్లాడిన ఎమ్మెల్యే రామన్న తన కొడుకుల భవిష్యత్తు చూడాలని స్వయంగా చెప్పిన ఎమ్మెల్యే వారి కోసం నా భవిష్యత్తును పణంగా పెట్టాడు.
          
           డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒప్పుకున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే దానికి అడ్డుకొన్నాడు. చివరకు తాను పార్టీ మారుతున్న విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ గారు సైతం నాకు స్వయంగా ఫోన్ చేసి ఎమ్మెల్యే జోగు రామన్న ఒత్తిడి వల్లే అప్పాయింట్మెంట్ ఇవ్వలేకపోయానని పేర్కొన్నారు.
      అందువలనే పార్టీ మరువలసి వచ్చింది అని అయన తెలిపారు.. అనంతరం అయన శనివారం ఆదిలాబాద్ కాంగ్రెస్   పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
Comments