ఎక్కువ మాట్లాడితే... చెప్పు తెగుద్ది.

Rathnakar Darshanala
ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుద్ది...గండ్రత్ సుజాత

నేటి వార్త జిల్లా ప్రతినిధి అదిలాబాద్ :

కంది శ్రీనివాసరెడ్డి బహిరంగంగా చేసిన ఆరోపణలు నిరూపించ లేకపోతే చెప్పుతో కొడతానని కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన నాయకురాలు గండ్ర సుజాత హెచ్చరించారు .
       జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక మహిళా ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా తనపై కోట్ల రూపాయలు ఇతర నాయకుల నుండి  తీసుకుంటున్నట్టు ఆరోపిస్తున్నారని ఆమె తెలిపారు.
    
                   ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి చేసిన  ఆరోపణలను రుజువు చేయాలని ఆమె సవాల్ చేశారు. తాను గత 25 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నానని ఇప్పటివరకు తనపై ఎవరు ఎటువంటి అసభ్య ఆరోపణలు చేయలేదని ఆమె అన్నారు.
 
                ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి పై చర్య తీసుకోవాలని ఆదిలాబాద్ రిటర్నింగ్ అధికారికి మరియు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిలాబాద్ కు వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేశానని ఆమె అన్నారు.
    
              కంది శ్రీనివాస్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని తాను ఈసారి ఎన్నికల బరిలో లేకపోయినా తనపై అసత్య ఆరోపణలు బహిరంగంగా చేస్తున్నారని దీనివల్ల తన పరువు ప్రతిష్టలు దిగజార్చే విధంగా ప్రవర్తించిన కంది శ్రీనివాసరెడ్డి పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను అధికారులను కోరినట్లు సుజాత తెలిపారు.
    
              ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన మాజీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మరియు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంజీవరెడ్డి, లతోపాటు పలువురు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
Comments