కమలం గూటికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్.

Rathnakar Darshanala
*కమలం గూటికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ *

* సోయం బాపూరావ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం.

ఆదిలాబాద్ నేటి వార్త :
హైదరాబాద్ జిల్లా బోథ్  ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఎట్టకేలకు గులాబీ పార్టీని వీడి కమలం గూటికి చేరారు.

బుధవారం ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో బాపూరావు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
         2014,  2018లో రెండుసార్లు బోథ్ శాసనసభ్యుడిగా బిఆర్ఎస్ తరఫున గెలిచిన రాథోడ్ బాపురావుకు ఈసారి ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో  టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రెండో జాబితాలో వన్నెల అశోక్ పేరును ఖరారు చేయడంతో బిజెపి నాయకులు మాజీ జెడ్పిటిసి ముస్తాపురే అశోక్ తో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్లి బిజెపి అగ్ర నేతల సమక్షంలో పార్టీలో చేరారు.
           
          రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కమలం కండువా కప్పి బాపురావ్ నుపార్టీలో స్వాగతించారు. ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి సోయంబాపురావ్ ను గెలిపించి తీరుతానని, తాను పార్టీ మారినా క్యాడర్ తన వెంటే ఉందని  పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ కు విధేయుడుగా ఉన్నప్పటికీ కొందరు నేతల నిర్వాకం వల్లే తనకు టికెట్టు దక్కకుండా పోయిందని అన్నారు.      
క్రమశిక్షణ కలిగిన బిజెపి పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని, తనకు అప్పచెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని , జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. ఇదే రోజు ఈ జిల్లా నుండి మాజీ ఎంపీ వివేక్ బిజెపి వదిలి కాంగ్రెస్ లో చేరిపోగా సాయంత్రం ఢిల్లీలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బిజెపిలో చేరడం ఆ పార్టీకి కాస్త ఓదార్పునిచ్చినట్టయింది.
Comments