దక్షిణ బద్రీనాథ్... లింబాద్రిగుట్ట జాతర సందర్భమున లింబాద్రి కల్యాణోత్సవం.

Rathnakar Darshanala
దక్షిణ బద్రీనాథ్... లింబాద్రిగుట్ట జాతర సందర్భమున  లింబాద్రి కల్యాణోత్సవం*

*నేటి వార్త నవంబర్ 22 ( నిజామాబాద్ జిల్లా బ్యూరో రాజుల రామనాథం)*:  నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం  లింబాద్రిగుట్ట  ఎత్తైన శిఖరం  ప్రత్యేక ఆలయం అంటూ లేని  పుణ్యక్షేత్రమే నిజామాబాద్ జిల్లా లింబాద్రిగుట్ట. గుహలు స్వయంభువుగా కొలువుదీరి సంతాన ప్రదాతాగా పూజలు అందుకుంటున్నా ఈ నరసింహస్వామి దర్శనం  జిల్లాలోని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు.

బుధవారం నరసింహ స్వామి  కల్యాణోత్సవం జరిగింది  రెండు అంతస్తులుగా ఉండే ఈ గుట్టలో మొదటి అంతస్తులో స్వామివారి  మాడవీధున్ని, కమల పుష్కరిణి, కళ్యాణ మండపాన్ని, రథాన్ని, చూడొచ్చు.  రెండవ అంతస్తులు రాతి గుహలు స్వామి మూలవిరాట్ ఆ పక్కనే విష్ణుమూర్తి, కృష్ణార్జున విగ్రహాలను, జోడు లింగాలు ఉంటాయి. వాటిని దర్శించుకోవడానికి  లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. 

ఈ క్షేత్రంలో ఏడాది మొత్తం జరిగే  పూజలు అయితే  నరసింహ స్వామి జయంతి రోజున ప్రత్యేక ఉత్సవాలు, కార్తిక మాసంలో  ఉత్సవాలను నిర్వహిస్తూ ఉండడం  మరొక్క ఎత్తు. జయంతి ఉత్సవాల సమయంలో ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే  గ్రామాలలోని ఉత్సవ  విగ్రహాలను ప్రత్యేకంగా ఊరేగింపుతో బోనాలతో కొండపైకి తీసుకొస్తారు.

ఈ సందర్భంగా  ఈరోజు నరసింహ స్వామి కళ్యాణోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని  వారి మొక్కులు తీర్చుకున్నారు..
Comments