వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అన్ని అవకతవకలే.
By
Rathnakar Darshanala
వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అన్ని అవకతవకలే*
*నా'ఖేడ్ ఆర్ సి నేటి వార్త ప్రతినిధి నవంబర్ 23*
నారాయణఖేడ్ నియోజకవర్గంలో 15 ఐకెపి సెంటర్లు ఉన్నాయి. లక్షల్లో ఆదాయాన్ని వచ్చిన రైతులకు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఐకెపి సెంటర్లో అన్ని అవకతవకలే ఒక్క తుర్కపల్లి సెంటర్ నుండి ఐకెపి కి ఎనిమిది నుంచి పది లక్షల ఇన్కమ్ వస్తున్న రైతులకు మాత్రం కనీసం సెంటర్ల వద్ద తాగునీరు, టెంట్లు, సుతిలీలు కార్పెట్లు ఇవ్వడం లేదని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యాన్ని తూకం చేసే కాంటాలు అన్ని రిపేర్ లోనే ఉన్నాయి.
ఎలా పడితే అలా కాంట చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులకు వరి ధాన్యాన్ని ఆరబోయడానికి కార్పెట్లు ఇవ్వకపోవడంతో కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరల్లోనే వరి ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతులు. ఐకెపి సెంటర్లో వరి ధాన్యం ఆరబోయడానికి స్థలం లేకపోవడంతో చెరువుకు సంబంధించిన అలుగులోనే రైతులు వరి ధాన్యాన్ని ఆరబోస్తున్నారు.
తుర్కపల్లి ఐకెపి సెంటర్ కు చెందిన అధికారి అశోక్ గౌడ్ ఇతను ఎప్పుడు సెంటర్కు వద్దకు వచ్చి చూసిన దాఖలాలు లేవు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు కట్ చేస్తారు ఇంకా రెండుసార్లు రైతులు ఎక్కువ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటారు.
ఎప్పుడు చూసినా హైదరాబాద్ వెళ్లాను నారాయణఖేడ్ లో ఉన్నాను అని సాకులు చెప్తూ రైతులకు నానా తిప్పలకు గురిచేస్తున్నారు. తుర్కపల్లి గ్రామానికి చెందిన 30 మంది లేబర్ హమాలి చేసేవారు వారిని పక్కకు తప్పించి బీహార్ నుంచి లేబర్ను తెప్పించారు.
ఒక క్వింటల్ ధాన్యానికి వీరికి ఐకెపి సెంటర్ వాళ్లు 30 రూపాయలు కట్టిస్తుండగా రైతుల వద్ద మాత్రం 45 రూపాయలు వసూలు చేస్తున్నారు.
ఈ ఐకెపి అధికారులు ఒక్క తుర్కపల్లి సెంటర్ నుండి ఐకెపి కి 6 నుండి 8 లక్షల ఆదాయం వస్తుంటే నియోజకవర్గంలోని అన్ని సెంటర్ల నుండి ఎంత ఆదాయం వస్తుందో మీరే గమనించాలి. ఇంత ఆదాయం వచ్చినా రైతులకు మాత్రం వారి సొంత డబ్బులతో సుతిలిలు టార్పేట్లు ఇంటి నుంచే వాటర్ బాటిల్ లో నీళ్లు చెట్ల కింద సేదా తీరుతున్నారు. ప్రతి పంటకు ఇంత ఆదాయం వచ్చినా అధికారులే మెక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
Comments