సొంత గుటికే చేరిన విద్యార్థి ఉద్యమ నేత. డా. ఎల్చాల దత్తత్రేయ. ఓయూ అధ్యక్షులు.
By
Rathnakar Darshanala
*కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన ఓయు జేఏసీ అధ్యక్షుడు డా.ఎల్చల దత్తాత్రేయ*
*సొంత గుటికే చేరిన విద్యార్థి ఉద్యమ నేత*
హైదరాబాద్ నేటి వార్త :
ఆదిలాబాద్ జిల్లా : అయన ఓ ఉద్యమ నేత, అయన పేరు చెపితే ఉద్యమానికే ఉద్యమానికే ఊపిరి ఆయనే అని చెప్పవచ్చు మన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన ఎల్చాల దత్తత్రేయ.
ప్రత్యేక కథనం :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ జెఏసి అధ్యక్షుడు డా.ఏల్చల దత్తాత్రేయ,స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జైలు జీవితం అనుభవించిన విద్యార్థి నేత ఉద్యమ సమయంలో ఆదిలాబాద్ జిల్లా మొత్తం తెలంగాణ విద్యార్థి ఉద్యమ చైతన్య బస్సు యాత్రలు నిర్వహించిన నాయకుడు, కెసిఆర్ సైతం పేరు పెట్టి పిలిచే సన్నిహితం ఓయూ జే ఏ సి అధ్యక్షుడిగా విద్యార్థి నిరుద్యోగ సామజిక,కార్మిక,కర్షక,సమస్యలపై నిరంతరం పోరాడిన దత్తాత్రేయ 2018 ఎన్నికల్లో ఎన్సీపీ పార్టీ తరఫున ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు,
ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి ఉద్యమంలో దత్తాత్రేయది ప్రత్యేక స్థానం,ఎమ్మెల్సీ కవిత గారికి సన్నిహితులు,అదిలాబాద్ జిల్లా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే,బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్నది దత్తాత్రేయలది ఉద్యమ బంధం,విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించిన దత్తాత్రేయ తిరిగి తన ఇంటి పార్టీలోకి రావడం చాలా గర్వంగా ఉందని కేటీఆర్ తెలిపారు,
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్,మధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్,బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు,రాష్ట్ర టూరిజం చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, పెద్ద సంఖ్యలో విద్యార్థి ఉద్యమ,కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments