కెసిఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండటం మన అదృష్టం... ఎమ్మెల్యే జోగు రామన్న..
By
Rathnakar Darshanala
కెసిఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండటం మన అదృష్టం... ఎమ్మెల్యే జోగు రామన్న.
అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే
పెట్టే బిజెపి కాంగ్రెస్ నాయకులు మనకు అవసరం లేదు..
* మూడు గంటల కరెంట్ అని కాంగ్రెస్. గుజరాత్ రైతులపై లాఠీచార్జి బిజెపి.
* బి ఆర్ఎస్ పథకాలు బిజెపి కాంగ్రెస్ నాయకులు కూడా పొందుతున్నారు
* ఇప్పటికీ కేసీఆర్ కు ఓటేయకుంటే నష్టం పోతాం.
* తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు.
* రైతు సంక్షేమానికి పాటుపడ్డ ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్.
* రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి
ఆదిలాబాద్ నేటి వార్త :
బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు.. ప్రజా క్షేత్రంలో మాత్రం ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తూ రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నారని, పథకాల ఫలాలు పొందుతూనే... ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వక్ర బుద్ధి చూపుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జైనథ్ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మి నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్థానిక నేతలు, ఆలయ కమిటి సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ దర్శనం అనంతరం మండలంలో తొలి ప్రచారాన్ని లాంచనంగా ప్రారంభించారు.
అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహనికీ పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలకగా.... డప్పు చప్పుళ్ళు, జై తెలంగాణ నినాదాలతో గ్రామా ప్రధాన వీధులు మారుమోగాయి. దీపాయిగూడలో ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు..
భారి ఎత్తున హాజరైన కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. అనంతరం తన స్వగ్రామమైన దీపాయిగూడ తో పాటు... ఆనంద్ పూర్, కూర, కరంజి, ఉంబిరి, ఖాప్రి, బెల్లూరి, బెల్గాం, మాకొడ గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రచారం చేపట్టారు. గ్రామగ్రామాన ఎమ్మెల్యేకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ శో లలో ప్రభుత్వ పనితీరును వివరిస్తూ.... బీ.ఆర్.ఎస్ మానిఫెస్టో లో పొందుపరిచిన హామీల తీరును వివరించారు.
కారుగుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. నూతనోత్సాహంతో ప్రచారంలో కార్యకర్తలు పాల్గొనడంతో గ్రామాలు గులాబిమయంగా మారాయి. కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఎమ్మెల్యే స్వయంగా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేయడం విశేషంగా ఆకట్టుకుంది. దీపాయి గూడ లోని భారి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించి పూజలు చేశారు. .
ఈ మేరకు ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ సుప్రసిద్ధ శ్రీ లక్ష్మి నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని మండలంలో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ళ బీ.ఆర్.ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్నీ గుర్తు చేశారు. దళారి వ్యవస్థను రూపుమాపేందుకు గానూ రైతుబందు ద్వార ఆర్ధిక సహాయాన్ని అందించడంతో పాటు... మద్దతు ధరకే పంటల కొనుగోళ్ళు చేపడుతున్నట్లు వివరించారు.
కాంగ్రెస్, బీజేపీల హయంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అన్నదాతలు ఆర్ధిక ప్రగతి సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పాటు పడుతున్నారని, మరోసారి ఆయనను ముఖ్యమంత్రిగా గెలిపించి మరిన్ని సంక్షేమ పథకాల ఫలాలు పొందాలని అన్నారు. గ్రామాలు ప్రగతిపథంలో నడవాలన్న సదుద్దేశంతో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.
తాజాగా బీ.ఆర్.ఎస్ ప్రవేశపెట్టిన మానిఫెస్టో
లో సైతం ప్రజా శ్రేయస్సును కోరి హామీలు పొందుపరచడం జరిగిందని తెలిపారు. అర్హులైన మహిళలకు మూడు వేల రూపాయల జీవన భ్రుతి, అయిదు లక్షల బీమా సౌకర్యం, నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్, పదిహేను లక్షలకు ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి పెంపు, రైతుబందు, ఆసరా పెన్షన్ల పెంపు వంటి హామీలను మానిఫెస్టో లో పొందుపరిచారని, ప్రజా శ్రేయస్సుకు పాటు పడుతున్న బీ.ఆర్.ఎస్ ను మరోసారి భారి మెజారిటీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, లింగారెడ్డి, విట్టల్ రెడ్డి, వేణు యాదవ్,సావాపురె విజయ్,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Comments