అసెంబ్లీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ సూచన.
By
Rathnakar Darshanala
రానున్న అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అధికారులకు సూచించారు . శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ, ఐటిడిఎ పి.ఓ లతో కలిసి సంబంధిత అధికారులకు ఎన్నికల నిర్వహణ విధులపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమలై తిరిగి ముగిసి పోయో వరకు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం విధులు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశాలను గురించి క్షుణ్ణంగా చదివి, అవగాహన కలిగి ఉండాలని అధికారులకు సూచించారు. ఎన్నికల కోడ్ అమలైన 24 గంటలలలో ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, పబ్లిక్ పార్కులు, బస్, రైల్వే స్టేషన్, పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర రాజకీయ పార్టీలకు సంబందించిన ప్లెక్సీలు, పోస్టర్స్, హోర్డింగ్స్, వాల్ పెయింటింగ్స్ తొలగించాలని ఆదేశించారు. శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని సూచించారు. ఎన్నికల విధులలో అధికారులు సంబంధిత సిబ్బంది కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని, విధులపై నిర్లక్ష్యం వహించిన వారిపై ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో సరిహద్దుల్లోని చెక్ పోస్టులలో 24 గంటల పాటు పర్యవేక్షణ చేపట్టేందుకు సిబ్బందిని నియమించడం జరిగిందని, పోలీస్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అక్రమంగా మద్యం, నగదు, డ్రగ్స్, గాంజ వంటి మత్తు పదార్థాలు తరలించకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్లు ఖుష్భు గుప్త, శ్యామలాదేవి, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మోహతో, ఇంచార్జ్ డిఆర్వో రమేష్ రాథోడ్, ఆర్డిఓ స్రవంతి, పోలీసు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
Comments