విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తున్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీర్.

Rathnakar Darshanala
విద్యార్థులతో కలిసి అల్పాహార భోజనం చేసిన కేటీఆర్.
 నేటి నుండి ప్రవేశపెట్టిన విద్యార్థులకు అల్పాహారం పథకంలో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీర్ సికింద్రాబాద్ లోని కాంటోమెంట్ పరిధిలోని వెస్ట్ మారేడు పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి అల్పాహారం బుజించారు.అనంతరం అయన మాట్లాడుతూ విద్యార్థులు కష్ట పడి చదువుకోవాలని మంచి ఉద్యోగాలు సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27,147 ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది అని అలాగే 23 లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది అని అన్నారు.

* దేశం లోనే మన రాష్ట్రం నెం 1.
కేటీర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే ప్రవేశపెట్టడం జరిగిందని మరో మరో గుర్తు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.
Comments
Comment Poster
Testing comment