ప్రజల చూపు సోమరాపు సత్యనారాయణ వైపు.
By
Rathnakar Darshanala
*ప్రజల చూపు సోమారపు వైపు*
నేటి వార్త ప్రతినిధి రామగుండం నియోజకవర్గ అక్టోబర్ 29
సోమారపు సత్యనారయణ అత్యంత ప్రతష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల కోలాహలం లో రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారయణ కి ఆదివారం లక్ష్మిపూరూ,వీర్లపల్లి లో ప్రజలు ఘనస్వాగతం పలికారు,స్వతంత్ర అభ్యర్థి గా పోటీలో ఉంటున్నానని గతంలో కూడా లక్ష్మీపూరము,వీర్లపల్లి ప్రజలు స్వతంత్ర అభ్యర్థి గా పోటీచేసినపుడు ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించారని తిరిగి రామగుండం ప్రజలు నన్ను గెలిపించుకోవడానికి సిద్దంగా ఉన్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు ,
ధరణి తో మాకు చాలా ఇబ్బంది ఏర్పడిందని అక్కడ ప్రజలు దృష్టికి తీసుకరగా,తాను గెలిచాక ధరణి కి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని తెలిపారు,RFCL లో ఎవరైతే దళారులను నమ్మి మొసపొయిన బాధితులు ఉన్నారొ వారందరికీ కూడా తను గెలిచాక న్యాయం చేస్తానని తెలియజేశారు . ఈ కార్యక్రమం లో సోమరపు లావణ్య అరుణ్ కుమార్,రాజమణి,కుసుమ,బిక్షపతి,వెంకటస్వామి పిడుగు కృష్ణ,ప్రవీణ్,వీరన్న,చంద్రశేఖర్,అశోక్,కిషోర్, రాయాలింగు,,సునీల్,సూరి, మహిలలు,యువకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Comments